ప్రభాస్ 25... సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో 'స్పిరిట్'

Published : Oct 07, 2021, 11:43 AM ISTUpdated : Oct 07, 2021, 11:58 AM IST
ప్రభాస్ 25... సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో 'స్పిరిట్'

సారాంశం

Prabhas 25వ చిత్రం సందీప్ రెడ్డి వంగతో అంటూ చిత్ర వర్గాలు కొద్దిరోజుల క్రితమే ధృవీకరించాయి. ప్రచారం జరిగినట్లే సందీప్ రెడ్డితో ప్రభాస్ మూవీ అధికారికంగా వెల్లడించడం జరిగింది.

వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనాలు చేసిన దర్శకుడు Sandeep reddy vangaతో పాన్ వరల్డ్ మూవీ ప్రకటించారు ప్రభాస్. ప్రభాస్ 25వ చిత్ర ప్రకటనపై వారం రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అక్టోబర్ 7న దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభాస్ టీమ్ ప్రకటించారు. 
 

Prabhas 25వ చిత్రం సందీప్ రెడ్డి వంగతో అంటూ చిత్ర వర్గాలు కొద్దిరోజుల క్రితమే ధృవీకరించాయి. ప్రచారం జరిగినట్లే సందీప్ రెడ్డితో ప్రభాస్ మూవీ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ నిర్ణయించారు. భారత దేశంలోని ప్రధాన భాషలైన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు, చైనా, జపాన్...  మూడు ప్రపంచ భాషలతో కలిపి మొత్తం ఎనిమిది బాషలలో స్పిరిట్ విడుదల కానుంది. 


రాధే శ్యామ్ మూవీ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్, వంగా ప్రణయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. ప్రకటనతోనే  Spirit పై అంచనాలు ఆకాశానికి చేరాయి.

Also read మహేష్‌ ఫ్యాన్‌కి గుడ్‌ న్యూస్‌ః ముద్దుల తనయ సితార గ్రాండ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ.. ఏకంగా దళపతి చిత్రంలో ?

మరోవైపు రాధే శ్యామ్ 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆదిపురుష్, సలార్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే పట్టాలెక్కనుంది. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి ప్రస్తుతం హీరో రన్బీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తున్నారు. కాబట్టి స్పిరిట్ 2023లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

Also read బాలయ్యతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్‌.. మళ్లీ ఫ్యాక్షన్‌

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?