అసలు బాహుబలిలో కథేముంది.. బుల్లితెర మెగాస్టార్ వ్యాఖ్యలు!

First Published Aug 7, 2018, 4:15 PM IST
Highlights

అసలు బాహుబలిలో పెద్ద కథేముంది..?. తన తల్లి తనకంటే పిన్ని కొడుకుని ప్రేమగా చూస్తుందని విలన్ గా మారిన అన్న క్యారెక్టర్ తన తల్లితోనే సోదరుడిని ఎలా చంపిస్తుందనేది కథ. 'ఛత్రపతి' సినిమా కూడా ఇలానే ఉంటుంది

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. గతవారం అయన డైరెక్ట్ చేసిన 'బ్రాండ్ బాబు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకర్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'సినిమాలో కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా.. డీలా పడడం ఖాయం.

అయితే ప్రేక్షకుల మెప్పుని పొందే విధంగా సినిమా తీయడంలో రాజమౌళికి మించిన వారు లేరు. బాహుబలి సినిమాను ఆయన డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. కథ చూస్తే చాలా చిన్నది కానీ రాజమౌళి దాన్ని ఓ రేంజ్ లో తెరకెక్కించారు. అసలు బాహుబలిలో పెద్ద కథేముంది..?. తన తల్లి తనకంటే పిన్ని కొడుకుని ప్రేమగా చూస్తుందని విలన్ గా మారిన అన్న క్యారెక్టర్ తన తల్లితోనే సోదరుడిని ఎలా చంపిస్తుందనేది కథ. 'ఛత్రపతి' సినిమా కూడా ఇలానే ఉంటుంది.

కానీ తన మేకింగ్ తో, సాంకేతిక విలువలతో సినిమా స్థాయిని పెంచారు. ఓ టెక్నీషియన్ గా ఏమైనా చేయగలనని నిరూపించాడు' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తను బాహుబలి లాంటి సినిమాలు చేయలేనని సెంటిమెంట్ కథలు మాత్రం బాగా డీల్ చేయగలననే నమ్మకం ఉందని అన్నారు.   

click me!