మహేశ్ బాబుతో మాస్ రాజా పోటీ.. ఒకసారి మిస్సయినా.. ఈసారి గురి తప్పనివ్వట్లేదుగా?

By Asianet News  |  First Published May 11, 2023, 1:08 PM IST

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మాస్ మహారాజా దుమ్ములేపుతున్నారు. వరుసగా హిట్లు అందుకుంటూ వస్తున్నారు. ఫ్లాప్స్ ఎదురైనా  సినిమాల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పోటీపడేందుకు సిద్ధం అవుతున్నారు. 
 


మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా  వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఫ్లాప్స్, హిట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్నారు. ‘రావణసుర’ ఫలితం కాస్తా బెడిసికొట్టినా తదుపరి ప్రాజెక్ట్స్ తో మాత్రం అంచనాలు పెంచుతున్నారు. 

ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పోటీగా సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మాస్ రాజా లైనప్ లో నెక్ట్స్ విడుదల కాబోతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageshwara Rao) వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీని తొలుత ఆగస్ట్ 11న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అదే సమయానికి మహేశ్ బాబు SSMB28 కూడా రిలీజ్ కాబోతున్నట్టు అప్పుడు ప్రకటించారు. ఫస్ట్ టైమ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు పోటీపడాల్సి ఉంది. కానీ ‘ఎస్ఎస్ఎంబీ28’ రిలీజ్ డేట్ వచ్చే ఏడాది సంక్రాంతికి మారడంతో క్లాష్ మిస్సయ్యింది. ఇక  ‘టైగర్ నాగేశ్వర రావు’ను  దసరా కానుకగా అక్టోబర్ 20కి మార్చారు.

Latest Videos

కానీ, రవితేజ  మాత్రం మహేశ్ బాబుతో బాక్సాఫీస్ వద్ద వార్ కు సిద్ధమన్నట్టుగానే కనిపిస్తున్నారు. మాస్ రాజా  లైనప్ లో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. యంగ్ హీరోతో ‘సూర్య వర్సెస్ సూర్య’ను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ  హీరోగా ‘ఈగల్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. హాలీవుడ్ మూవీ జాన్ విక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 

సెలెంట్ గా Eagle చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. టైగర్ నాగేశ్వర్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత రిలీజ్ చేసేలా సినిమాను రూపొందిస్తున్నాంరంట.  అంటే 2024 సంక్రాంతి బరిలో ‘ఈగల్’ ఉండబోతుందని తెలుస్తోంది.  ఈ డేట్ కే Project K, SSMB28 రిలీజ్ కాబోతున్నాయి. ఇక రవితేజ కూడా సంక్రాంతి పోరుకు సిద్ధం అవుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. మరిన్ని చిత్రాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

click me!