
రిచర్డ్ మడెన్, ప్రియాంక చోప్రా (priyanka chopra) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel). తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 28 నుంచి ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. అలాగే ఈ సీరిస్ తెలుగు ట్రైలర్ ని వదిలారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్‌ధావన్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
గతం మర్చిపోయిన ఇద్దరు ఏజెంట్లు ఒకరినొకరు కలవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సడన్ గా వారిద్దరి మీద కొందరు అటాక్ చేయడం, వారు ఒకరికి ఒకరు గుర్తుకురావడం ఇలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగుతుంది. వీరిద్దరూ ఏ దేశానికి చెందిన ప్రైవేటు గూడాచారి సంస్థకు పనిచేసేవారని తర్వాత రివీల్ అవుతుంది. ఈ ట్రైలర్ లో సిరీస్ కథను ఏమాత్రం రిలీజ్ చేయలేదు. మంచులో, ట్రైన్ లో సూపర్బ్ గా ఉండే యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు.
ఏప్రిల్ 28వ తేదీన ‘సిటడెల్’ మొదటి రెండు ఎపిసోడ్లు స్ట్రీమ్ కానున్నాయి. తర్వాత వారానికో ఎపిసోడ్ చొప్పున మే 26వ తేదీ వరకు స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్‌రకు వివిధ దేశాల్లో స్పిన్ ఆఫ్‌లను కూడా రూపొందిస్తున్నారు. ఇండియన్ వెర్షన్ ‘సిటడెల్’కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత నటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. 2024లో ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటలీ, స్పెయిన్, మెక్సికోల్లో కూడా ‘సిటడెల్’ వెర్షన్లపై వర్క్ జరుగుతోంది.