
షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ప్రారంభంలో కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించి మెప్పించిన అతను కలర్ ఫొటో సినిమాలో హీరోగానూ అదరగొట్టేశాడు. ఇక గమనం, ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్ హిట్ 2 సినిమాల్లో సైకో కిల్లర్ పాత్రలు పోషించి అందరినీ భయపెట్టాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న సుహాస్ త్వరలోనే రైటర్ పద్మభూషణ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు. రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించింది. కామెడీ, ఎమోషనల్, అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చింది. సినిమా ప్రమోషన్స్ కూడా చిత్రయూనిట్ సరికొత్తగా చేయటం కలిసివచ్చింది .
సినిమాకి ఆదరణ పెంచడానికి ఉమెన్స్ కి స్పెషల్ గా ఒక రోజంతా పలు థియేటర్స్ లో ఫ్రీ షోలు వేశారు. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత సుహాస్ ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఆయన వరస సినిమాలు కమిటవ్వుతున్నాడు. అదే సమయంలో రెమ్యునరేషన్ కూడా పంచాడని సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం కోటిన్నర దాకా అడుగున్నాడు. అయితే ఇంత రెమ్యునరేషన్ ఇచ్చి సుహాస్ తో సినిమా చేస్తే ప్రతీ సినిమా కలర్ ఫొటో లేదా ' రైటర్ పద్మ భూషణ్' అవుతుందా అంటున్నారు.
ఇక ' రైటర్ పద్మ భూషణ్' సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మొదటి వారంలోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళింది. అమెరికాలో కూడా 300K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసింది. ఓటిటిలో కూడా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.