పుకార్లపై స్పందించిన పోసాని!

Published : Jul 15, 2019, 11:41 AM IST
పుకార్లపై స్పందించిన పోసాని!

సారాంశం

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని.. ఇటీవల చేసిన సర్జరీ కూడా వికటించిందని వైద్యులు శక్తివంచన లేకుండా ఆయనకి చికిత్స అందిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

వీటిపై స్పందించిన పోసాని.. తనే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా తనకు ఆరోగ్యం బాగాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. నిజంగానే తనకు ఆరోగ్యం బాగాలేదని.. కానీ చచ్చిపోయేంత సీరియస్ కాదని.. డాక్టర్లు తనను ఆరోగ్యవంతుడిగా చేశారని, కాబట్టి తన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. పది రోజుల్లో తిరిగి షూటింగ్ కి వెళ్తానని.. తెరపై కనిపిస్తానని చెప్పారు.

పోసానికి ఆరోగ్యం సరిగ్గా లేని మాట నిజమే.. ఆయనకి సర్జరీ జరిగిన మాట కూడా వాస్తవమే.. కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన రొటీన్ చెకప్ కోసం యశోదా హాస్పిటల్ కి వెళ్లడంతో మరోసారి అతడి ఆరోగ్యంపై పుకార్లు పుట్టించారు. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌