జూ.ఎన్టీఆర్, బాలయ్యలతో వేదిక పంచుకోనున్న వైఎస్ జగన్ ?

Published : Jul 15, 2019, 11:32 AM ISTUpdated : Jul 15, 2019, 11:45 AM IST
జూ.ఎన్టీఆర్, బాలయ్యలతో వేదిక పంచుకోనున్న వైఎస్ జగన్ ?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ లతో కలసి ఏపీ సీఎం జగన్ వేదిక పంచుకొనునున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ లతో కలసి ఏపీ సీఎం జగన్ వేదిక పంచుకొనునున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమకు ప్రతి సంవత్సరం అందించే నందు అవార్డుల ప్రధానోత్సవం సరిగా జరగడం లేదు. నంది అవార్డులకు బ్రేకులు పడుతున్నాయి. 

2014,2015, 2016 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల విజేతలని ప్రకటించింది. కానీ అవార్డులు ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా వైసిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనితో పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల వేడుకని త్వరలోనే ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

2014 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా బాలయ్య ఎంపికయ్యారు. లెజెండ్ చిత్రానికి బాలయ్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్నారు. ఇక 2015లో శ్రీమంతుడు చిత్రానికి మహేష్ బాబు, 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలకు జూ. ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.  

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల వేడుక నిర్వహిస్తే ఎన్టీఆర్, బాలకృష్ణ, వైఎస్ జగన్ లని ఒకే వేదికపై చూసే అవకాశం ఉంటుంది. 

 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌