
గీతు రాయల్.. బిగ్ బాగ్ తో బాగా ఫేమస్ అయ్యింది ఈ పేరు. గతంలో తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోయినా.. బిగ్ బాస్ తరువాత అసలు పరిచయమే అక్కర్లేదు అన్నంతగా పేమస్ అయిపోయింది గీతు. టిక్‌టాక్ వీడియోల తో కాస్త ఫేమస్ అయిన గీతు... బిగ్ బాస్ తరువాత బాగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేసుకుంటూ.. మరో వైపు టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ.. బిజీగా ఉంటోంద బ్యూటీ. అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. వైరల్ న్యూస్ గా కూడా మారుతుంది.
యూట్యూబ్ లో వీడియోలు చేస్తుకుంటూ.. ఇన్ స్టాలో అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది గీతురాయల్. ఈక్రమంలో గీతురాయల్ రీసెంట్ గా చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్ళిన గీతు.. అక్కడ ఆడియన్స్ తో కలిసి డాన్స్ చేస్తూ.. తెగ సందడి చేసింది. చేయడమే కాకుండా.. ఆ వీడియోను ఇన్ స్టాలో అభిమానులతో శేర్ చేసుకుంది గీతు.
ఇంతకీ అసలు విషయంఏంటీ అంటే.. టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది కదా.. ఈరోజు ( ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా .. బన్నీకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకువచ్చిన దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రీరిలీజ్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఇక ఈసినిమా రీరిలీజ్ కు గీతూ రాయల్ వెళ్లారు. థియేటర్‌లో సినిమా చూశారు. ఈ సందర్భంగా కొన్ని పాటలకు ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఇక, ఈ వీడియోకు భారీగా స్పందన వచ్చింది. కొందరు పాజిటీవ్ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు నెగెటీవ్ గా స్పందిస్తున్నారు. మిగిలిన వాళ్ళు సినిమా చూడకుండా.. సినిమా హాల్లో ఏంటా రచ్చ.. మిగిలిన వాళ్లు సినిమా చూడాలా వద్దా అంటూ మండి పడుతున్నారు. సినిమా చూడ్డానికివచ్చావా.. లేక వీడియో తీసుకోవటానికి వచ్చావా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అక్కా నువ్వు చాలా గ్రేట్.. సినిమా చూడ్డం వేరు.. సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడ్డం వేరు.....గీతూ అక్కతో అట్టా ఉంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు మల్టీప్లెక్స్‌ను మాస్ థియేటర్ చేశాం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది గీతు.