ఆ టైమ్‌లో చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారుః పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Sep 28, 2021, 7:26 PM IST
Highlights

 చిరంజీవి(chiranjeevi)పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని కృష్ణమురళీ(posani krishna murali). చిరంజీవి గుండెల్లో తాను ఉన్నానని తెలిపారు. ఆయన తనని బాగా అభిమానిస్తారని పేర్కొన్నారు. ప్రెస్‌ క్లబ్‌లో పోసాని మాట్లాడారు. 

నటుడు పోసాని కృష్ణమురళీ(posani krishna murali) బ్యాక్ టూ బ్యాక్‌ పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan)పై విరుచుకుపడుతున్నారు. సోమవారం ఓ ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోగా, మంగళవారం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేసమయంలో ఆయన చిరంజీవి(chiranjeevi)పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గుండెల్లో తాను ఉన్నానని తెలిపారు. ఆయన తనని బాగా అభిమానిస్తారని పేర్కొన్నారు. ప్రెస్‌ క్లబ్‌లో పోసాని మాట్లాడారు. 

చిరంజీవి `ప్రజారాజ్యం` పెట్టిన కొత్తలో అవినీత గురించి మాట్లాడారు. ఆయన్ని అప్రతిష్టపాటు చేయాలని కొందరు టీడీపీ నాయకులు ప్లాన్‌ చేశారు. చిరంజీవి కుమార్తె గురించి, వారింట్లోమహిళల గురించి లైవ్‌లో ఘోరంగా విమర్శించారు. ఆ విమర్శలను తట్టుకోలేకపోయిన చిరంజీవి భోజనం కూడా చేయలేదట. వ్యాన్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. ప్రజారాజ్యంలో ఉన్న కన్నబాబు ఫోన్‌ చేసి తనకు జరిగిన విషయం చెప్పారట. `ఆ సమయంలో చిరంజీవితో మాట్లాడాను. గద్గద స్వరంతో `పోసాని.. రాజకీయాలకు, నా భార్యబిడ్డలకు ఏం సంబంధం` అని వాపోయారు. వెంటనే ప్రజారాజ్యం ఆఫీస్‌కి వెళ్లి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించా. ఆ వైపు నుంచి సమాధానం లేదు` అని పోసాని తెలిపారు. 

ఆ సమయంలో చిరంజీవి.. తన సన్నిహితులతో `పోసాని నా గుండెల్లో ఉన్నారు` అని అన్నారట. ఆ రోజు చిరంజీవి కుటుంబాన్ని అన్ని మాటలు అంటుంటే పవన్ కళ్యాణ్‌ ఎక్కడున్నారు, ఆయన అభిమానులు ఎక్కడున్నారని పోసాని ప్రశ్నించారు. అప్పుడు మీ నోర్లు ఏమయ్యాయని మండి పడ్డారు. `బెల్లంకొండ సురేశ్‌గారు చిరంజీవిని ఏదో అన్నారని, అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. `ఇది సినిమా ఇండస్ట్రీ విషయం మీకు సంబంధం లేదు` అని చిరంజీవి వారికి గట్టిగా చెప్పారని తెలిపారు. `చిరంజీవిగారు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి` అని పోసాని కృష్ణమురళి అన్నారు.

పోసాని చిరు గురించి ఇంకా చెబుతూ, `నాకూ చిరంజీవికి రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, వ్యక్తిగతంగా మంచిగానే ఉంటాం. ఏం చెప్పినా, విని అర్థం చేసుకునే పరిణతి ఆయనకు ఉంది. చిరంజీవి పార్టీ పెట్టి పొరపాటు చేశారు. జనం శిక్షించారు. అయిపోయింది. ఆయన వ్యక్తిత్వాన్ని దూషించకూడదు. చంద్రబాబు పార్టీ మనషులు చిరంజీవి కుటుంబాన్ని విమర్శించారు. నువ్వు మాట్లాడావా? నేను మాట్లాడా. చిరంజీవి కోసం చచ్చిపోవడానికి సిద్ధమని నేను చెప్పాన`ని పోసారి తెలిపారు.

click me!