రెండో వారం ఎలిమినేషన్‌ నటరాజ్‌ మాస్టర్‌ ‌?.. సేవ్‌ అయ్యింది వీళ్లే..

Published : Sep 19, 2021, 12:18 AM IST
రెండో వారం ఎలిమినేషన్‌ నటరాజ్‌ మాస్టర్‌ ‌?.. సేవ్‌ అయ్యింది వీళ్లే..

సారాంశం

మరోవైపు రెండో వారం ఎలిమినేషన్‌ రసవత్తరంగా మారింది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్‌ అయ్యింది.ఆమె వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌ టైమ్‌ వచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్‌, లోబో సేవ్‌ అయ్యారు. 

బిగ్‌బాస్‌5 రెండో వారం రసవత్తరంగా సాగుతుంది. శనివారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు నాగార్జున గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఉమాదేవితో గుంజీలు, స్వేత వర్మతో చెంప్పదెబ్బలు వేయించాడు. సిరి, లోబో, మానస్‌, షణ్ముఖ్‌లకు సైతం హెచ్చరించారు. మరోవైపు ఇంటిసభ్యులపై ప్రశంసలు కురిపించారు. అందరు బాగా ఆడుతున్నారని,టాస్క్ ల కోసం ప్రాణం పెడుతున్నారని తెలిపారు. మరోవైపు ఐదో సీజన్‌ ఓపెనింగ్‌ సెర్మనిలో 18 టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చిందని, గతం కంటే ఇది ఎక్కువ అని తెలిపారు. 

మరోవైపు రెండో వారం ఎలిమినేషన్‌ రసవత్తరంగా మారింది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్‌ అయ్యింది.ఆమె వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌ టైమ్‌ వచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్‌, లోబో సేవ్‌ అయ్యారు. వీరితోపాటు ప్రియాంక సింగ్‌ కూడా సేవ్‌ అయ్యారు. ఇంకా నామినేషన్స్ లో ప్రియా, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌ ఉన్నారు. ఇందులో రెండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

అయితే సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం రెండో వారం నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అవుతారనే తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఉమాదేవి పేరు కూడా వినిపిస్తుంది. హౌజ్‌లో బూతులతో విరుచుకుపడ్డ ఉమాదేవిని ఇంటికి పంపించే అవకాశాలుంటాయని అంటున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు వెళ్తారనేది సస్పెన్స్ నెలకొంది. రెండో వారంలో కాజల్‌, ప్రియా సేవ్‌ అయ్యే ఛాన్స్ ఉందని టాక్‌. ఇదిలా ఉంటే నటరాజ్‌ మాస్టర్ బెస్ట్ పర్‌ఫెర్మెర్‌ గా అందరిచేత ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?