పోర్నోగ్రఫీ కేసు: రాజ్ కుంద్రాకు బెయిల్... శిల్పా శెట్టి ఫస్ట్ రియాక్షన్!

Published : Sep 21, 2021, 10:54 AM IST
పోర్నోగ్రఫీ కేసు: రాజ్ కుంద్రాకు బెయిల్... శిల్పా శెట్టి ఫస్ట్ రియాక్షన్!

సారాంశం

దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన రాజ్ కుంద్రా, విడుదల కావడం జరిగింది. భర్తకు బెయిల్ లభించగా, శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.   


పోర్నోగ్రఫీ కేసులో ముద్దాయిగా ఉన్న రాజ్ కుంద్రాకు ముంబై కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50000 పూచీకత్తుపై రాజ్ కుంద్రాతో పాటు అతని అసోసియేట్ రియాన్ థోర్ప్ కి బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన రాజ్ కుంద్రా, విడుదల కావడం జరిగింది. భర్తకు బెయిల్ లభించగా, శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 


శిల్పా శెట్టి పరోక్షంగా మంచి రోజులు వచ్చాయంటూ, రాజ్ కుంద్రా విడుదలపై ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పోస్ట్ చేశారు. ఓ భీకర తుపాను తరువాత వచ్చే ఇంద్ర ధనుస్సు, చెడు తరువాత మంచి జరుగుతుందని చెప్పడానికి నిదర్శనం... అంటూ ఆమె కోట్ చేశారు. విచారణ పేరుతో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదల కావడాన్ని, ఆమె సోషల్ మీడియా పోస్ట్ తెలియజేస్తుంది. 


మరోవైపు 1500 పేజీల ఛార్జ్ షీట్ ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్ట్ కి సమర్పించారు. శిల్పా శెట్టితో పాటు 43మంది సాక్షుల వాంగ్మూలం, ఛార్జ్గ్ షీట్ లో పొందుపరిచారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌