అరెస్ట్ చేస్తామన్న జడ్జి హెచ్చరికలతో కోర్టుకి హాజరైన కంగనా  రనౌత్

Published : Sep 21, 2021, 09:50 AM IST
అరెస్ట్ చేస్తామన్న జడ్జి హెచ్చరికలతో కోర్టుకి హాజరైన కంగనా  రనౌత్

సారాంశం

పరువు నష్టం దావా కేసు ఎదుర్కొంటున్న కంగనా రనౌత్, వాయిదాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో, గత హియరింగ్ లో కంగనా తరపు న్యాయవాదిని జడ్జి హెచ్చరించారు. తదుపరి కోర్ట్ విచాణకు కంగనా హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని జడ్జి తెలిపారు.  

సోమవారం నటి కంగనా రనౌత్ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకి హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసు ఎదుర్కొంటున్న కంగనా రనౌత్, వాయిదాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో, గత హియరింగ్ లో కంగనా తరపు న్యాయవాదిని జడ్జి హెచ్చరించారు. తదుపరి కోర్ట్ విచాణకు కంగనా హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని జడ్జి తెలిపారు.  


ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు.అయితే కోర్ట్ ఆదేశాల పట్ల కంగనా అసహనం వ్యక్తం చేశారు.  బెయిల్‌ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్‌ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్‌ ఒకటిన విచారించనుంది.  

 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్‌ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్‌ అక్తర్‌లను పరోక్షంగా ఉద్దేశిస్తూ బాలీవుడ్‌లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్‌ అక్తర్‌ గతంలో పరువు నష్టం కేసు వేశారు.


 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?