విషాదంః కరోనాతో సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కన్నుమూత..

Published : Apr 23, 2021, 07:50 AM ISTUpdated : Apr 23, 2021, 07:59 AM IST
విషాదంః కరోనాతో సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కన్నుమూత..

సారాంశం

ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్‌ రాథోడ్‌(66) కన్నుమూశారు. సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కరోనాతో పోరాడి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్‌ రాథోడ్‌ వెల్లడించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్‌ రాథోడ్‌(66) కన్నుమూశారు. సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కరోనాతో పోరాడి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్‌ రాథోడ్‌ వెల్లడించారు. `రాత్రి 10.15 నిమిషాలకు  నాన్న చనిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించండి` అని తెలిపారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే సోమవారం ఆరోగ్యం పరిస్థితి సీరియస్‌గా మారడంతో ముంబయిలోని ఎస్‌ఎల్‌ రహేజా హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. దాదాపు నాలుగు రోజులపాటు కరోనాతో పోరాడి గురువారం నైట్‌ కన్నుమూశారు. 

నదీమ్‌తో కలిసి శ్రావణ్‌ బాలీవుడ్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. ఐకానిక్‌ కంపోజర్స్ గా పేరు తెచ్చుకున్నారు. మ్యూజిక్‌ బ్లాక్‌బస్టర్స్ `ఆషిఖీ`, `సాజన్‌`, `హమ్‌ హై రహీ ప్యార్‌ కే`, `పర్దేశ్‌`, `రాజా హిందుస్థానీ`, `రాజా`, `బర్సాత్‌`, `అగ్నీ శక్తి`, `జీత్‌`, `రాజ్‌`, `కసూర్‌`, `ధాడ్కన్‌`, `దిల్‌ హై తుమ్హారా`, `దిల్‌ కా రిస్టా`, `అందాజ్‌`, `బేవాఫా` వంటి సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన వాటి విజయాల్లో భాగమయ్యారు. వీరి సంగీతంలో లతా మంగేష్కర్‌, ఆశా బోంస్లే, సోనూ నిగమ్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర, ఉదిత్‌ నారాయణ్‌, శంకర్‌ మహదేవన్‌ వంటి దాదాపు అందరు సింగర్స్ పాటలు పాడటం విశేషం.

నదీమ్‌ షఫీ- శ్రావణ్‌ రాథోడ్‌ కలిసి మ్యూజిక్‌ డైరెక్టర్స్ గానే కాకుండా మ్యూజిక్‌ ప్రొడ్యూసర్స్ గా, కంపోజర్స్ గా, సింగర్స్ గా, ఇన్‌స్ట్రూమెంటలిస్ట్ గా పనిచేశారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. నదీమ్‌ సొంతంగా కంపెనీ పెట్టుకోగా, శ్రావణ్‌ తన కుమారుడు రాజీవ్‌, దర్శన్‌ సంగీత కెరీర్‌పై దృష్టిపెట్టారు. కానీ ఆ తర్వాత 2009లో మళ్లీ కలిసి పనిచేయడం ప్రారంభించారు. మధ్య మధ్యలో విడిపోవాడం, తర్వాత కలవడం చేశారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 

 

బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ మరణంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి చేదు వార్తలను వినాల్సి వస్తుందో ఊహించలేకపోతున్నామని, శ్రావణ్‌ మరణం బాలీవుడ్‌కి తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ సంతాపాన్ని తెలియజేశారు. `శ్రావణ్‌ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా. చాలా బాధగా ఉంది. ఆయనతో నాకు చాలా మంది అనుబంధం ఉంది. `జుడాయి అండ్‌ సిర్ఫ్ తుమ్‌` చిత్రాలకు సంగీతం అందించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. శ్రేయా ఘోషల్‌, అద్నాన్‌ షమీ, జీత్‌ గంగూలి, ప్రీతమ్‌ వంటి వారు సంతాపం తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌