వ్యానిటీ వ్యాన్‌ డ్రైవర్‌ మృతి..స్టయిలీస్ట్ కి కరోనా.. ఐసోలేషన్‌లో రామ్‌చరణ్‌, మహేష్‌

Published : Apr 22, 2021, 07:52 PM IST
వ్యానిటీ వ్యాన్‌ డ్రైవర్‌ మృతి..స్టయిలీస్ట్ కి కరోనా.. ఐసోలేషన్‌లో రామ్‌చరణ్‌, మహేష్‌

సారాంశం

ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా కారణంగా సూపర్ స్టార్‌ మహేష్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు. 

కరోనా సునామీలా వెంటాడుతుంది. చిన్నా పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా ఎవరైతే అజాగ్రతగా ఉంటారో వారిని వెంటాడుతుంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా కారణంగా సూపర్ స్టార్‌ మహేష్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు.  రామ్‌ చరణ్‌ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన జయరాం.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామ్‌ చరణ్‌ ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోబోతున్నారని సమాచారం. కాగా గతంలో ఒకసారి చరణ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

దీంతోపాటు మహేష్‌ పర్సనల్‌ స్టయిలీస్ట్ కూడా కరోనా సోకింది. `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్‌ యూనిట్‌లోని మరికొందరికి కరోనా సోకింది. దీంతో మహేష్‌ ఇప్పుడు ఐసోలేట్ అయ్యారట. తాజాగా `స్టేసేఫ్‌ మహేష్‌ అన్న` అనే యాష్‌ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. షూటింగ్‌ని తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం ముఖ్యం. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుండటం విశేషం. అంతేకాదు అటు రామ్‌చరణ్‌,ఇటు మహేష్‌ ఫ్యాన్స్ లో ఆందోళన స్టార్ట్ అయ్యింది.

వీరితోపాటు `రాధేశ్యామ్‌` టీమ్‌కి, ప్రభాస్‌ పర్సనల్‌ మేకప్‌ మేన్‌కి కరోనా సోకడంతో ఆయన కూడా ఐసోలేట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ రోజు తనకు కరోనా సోకినట్టు హీరో కళ్యాణ్‌ దేవ్‌ ప్రకటించారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇలా చిత్ర పరిశ్రమని కరోనా ఓ రేంజ్‌లో వెంటాడుతుంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో థియేటర్ల బంద్‌ పాటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే 50శాతం యూనిట్‌తోనే చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకోవాలని ఫిల్మ్ ఛాంబర్స్ సూచించాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్