ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్‌ కన్నుమూత.. శోకసంద్రంలో కన్నడ పరిశ్రమ

By Aithagoni RajuFirst Published Oct 12, 2020, 4:10 PM IST
Highlights

సంగీత దర్శకుడు రాజన్‌  `రాజన్‌-నాగేంద్ర` ద్వయంలో ఒకరు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలకు సంగీతం అందించారు. మైసూర్‌లో జన్మించిన రాజన్‌.. తన సోదరుడే నాగేంద్ర కావడం విశేషం.

ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్‌(87) కన్నుమూశారు. బెంగుళూరులోని తన నివాసంలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఆయన మృతి చెందినట్టు రాజన్‌ కుమారుడు అనంత్‌ కుమార్‌ తెలిపారు. 

సంగీత దర్శకుడు రాజన్‌  `రాజన్‌-నాగేంద్ర` ద్వయంలో ఒకరు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలకు సంగీతం అందించారు. మైసూర్‌లో జన్మించిన రాజన్‌.. తన సోదరుడే నాగేంద్ర కావడం విశేషం. ఇద్దరు కలిసి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అద్భుతమైన పాటలను స్వరపరిచారు. 

1952లో విడుదలైన `సౌభాగ్య లక్ష్మి` చిత్రంతో సంగీత దర్శకులుగా కెరీర్ని ప్రారంభించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సంగీత దర్శకులుగా పనిచేవారు. దాదాపు రెండు వందలకుపైగా కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే 175 తెలుగు, తమిళ, మలయాళ, తుళు, సింహాళం చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో `పూజలు సేయ`, `ఇంటింటి రామాయణం`, `మానస వీణ మధుగీతమ్‌`వంటి సినిమాలున్నాయి. 

 ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. వీరి సోదరుడు నాగేంద్ర 2000లో మరణించారు. రాజన్‌ మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందని చెప్పొచ్చు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు స్పందించి సంతాపం తెలిపారు. 

click me!