కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలి..దర్శక, నటుడు లలిత్‌ బెహల్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published Apr 25, 2021, 7:32 AM IST
Highlights

కరోనా మరో సినీ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ హిందీ నటుడు లలిత్‌ బెహల్‌(71) శనివారం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 

కరోనా మరో సినీ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ హిందీ నటుడు లలిత్‌ బెహల్‌(71) శనివారం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ప్రముఖ దర్శకుడు కాను బెహల్‌ వెల్లడించారు. `నాన్నకి హృద్రోగ సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు ఆయన కోవిడ్‌ 19 బారిన పడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ మరింత సీరియస్‌ గా మారడంతో ఆయన తుది శ్వాస విడిచారు` అని తెలిపారు. లలిత్‌కి కరోనా సోకడంతో గత వారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

 `తిత్లీ`, `ముక్తి భవన్‌` వంటి కమర్షియల్ గా‌, క్రిటిక్స్ వైజ్‌గా ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లలిత్‌ బెహల్‌. `తిత్లీ`కి తనయుడు దర్శకత్వం వహించడం విశేషం. కంగనా రనౌత్‌ చిత్రం `జడ్జిమెంటల్‌ హై క్యా`, వెబ్‌ సిరీస్‌ `మేడిన్‌ హెవెన్‌`లో లలిత్‌ బెహల్‌ చివరిసారిగా నటించారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన,  దూరదర్శన్‌ కోసం దర్శకుడిగా, నిర్మాతగా `తాపిష్‌`, `ఆతిష్‌`, `సనెహరి జిల్డ్` వంటి టెలీఫిల్మ్స్‌ రూపొందించారు. పలువురు ప్రముఖులు లలిత్‌ బెహల్‌ మృతి పట్ల విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Extremely saddened by the demise of one of my dearest and most respected Co-actors, Lalit Behl jee. Who, so brilliantly played the father in ! I feel the loss of my father again! Dear Kanu I am so very sorry for your loss! pic.twitter.com/wfbj22yQgd

— Adil hussain (@_AdilHussain)
click me!