కార్ యాక్సిడెంట్ లో మరణించిన ప్రముఖ సింగర్!

Published : Oct 02, 2018, 10:35 AM IST
కార్ యాక్సిడెంట్ లో మరణించిన ప్రముఖ సింగర్!

సారాంశం

ప్రముఖ గాయకుడు, వయోలినిస్ట్ బాలభాస్కర్(40) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం నాడు కన్నుమూశారు. సెప్టెంబర్ 25న కుటుంబంతో సహా దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రముఖ గాయకుడు, వయోలినిస్ట్ బాలభాస్కర్(40) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం నాడు కన్నుమూశారు. సెప్టెంబర్ 25న కుటుంబంతో సహా దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

గత సోమవారం త్రిస్సూర్ లోని ఓ ఆలయాన్ని దర్శించుకోవడానికి భార్య లక్ష్మీ, కుమార్తె తేజస్విలతో సహా బాలభాస్కర్ వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకొని ఇంటికి వస్తోన్న క్రమంలో వారు ప్రయాణిస్తోన్న వాహనం అదుపుతప్పి, రహదారిపై ఉన్న ఓ చెట్టుని ఢీకొట్టింది. దీంతో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి(2) అక్కడికక్కడే మరణించగా, భాస్కర్, ఆయన భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్ లకు తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వారిని తిరువనంతపురంలోని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాలభాస్కర్ మెదడుకు గాయం కావడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెదడులో రక్తస్రావం కావడంవలన ఆయన మరణించారని డాక్టర్లు వెల్లడించారు. ఆయన భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్ లు హాస్పిటల్ లో 
చికిత్స పొందుతున్నారు. బాలభాస్కర్ భౌతికకాయాన్ని సందర్శనార్ధం ఆయన చదువుకున్న తిరువంతపురం కాలేజీకి తరలించనున్నారు.

పన్నెండేళ్ల వయసులోనే సంగీత విద్వాంసుడిగా మారిన బాలభాస్కర్ మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్న వయస్కుడైన సంగీత దర్శకుడిగా ఘనత సాధించారు. ఆయన 
మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అభిమానులకు అక్కినేని కోడలు సూపర్ గుడ్‌న్యూస్.. పెళ్లైన ఇన్ని రోజులకు..!
Who Is Natalie Burn: అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించిన `టాక్సిక్` గ్లామర్ డాల్ ఎవరో తెలుసా?