టీజర్ లో బాలయ్య ..పాపులర్ ఫోన్ కాల్ కాన్వర్షేషన్,నవ్వులే నవ్వులు

Published : Apr 27, 2023, 12:45 PM IST
 టీజర్ లో  బాలయ్య ..పాపులర్ ఫోన్ కాల్ కాన్వర్షేషన్,నవ్వులే నవ్వులు

సారాంశం

 శ్రీవిష్ణు (Sree Vishnu). ప్రస్తుతం శ్రీవిష్ణు సామజవరగమన (Samajavaragamana) సినిమాలో నటిస్తున్నాడు. వివాహ భోజనంబు ఫేం రామ్‌ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. 

సినిమాకు క్రేజ్ తేవటానికి దర్శక,నిర్మాతలు రకరకాల మార్గాలు వెతుకుతూంటారు. అలాంటివాటిల్లో పాపులర్ పదాలు కానీ , సంఘటనలు కానీ , వీడియోలను కానీ గుర్తు చేయటం. రీసెంట్ గా చిరంజీవి తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్యలో జంబలకిడి జారు మిఠాయి అంటూ నవ్వించారు. చిరంజీవి వంటి మెగాస్టార్ నుంచి అలాంటిది ఊహించని వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు. ఇప్పుడు శ్రీ విష్ణు తాజా చిత్రం సామజవరగమనలో అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది.  ఓ ఫ్యాన్ ... బాలయ్య కు చేసే  ఫోన్ కాల్ బాగా పాపులర్. దాన్ని టీజర్ లో వాడారు. 

శ్రీవిష్ణు తాజా చిత్రంగా రూపొందిన 'సామజ వర గమన' మే 18వ తేదీన థియేటర్లకు రానుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రెబా మోనిక జాన్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

సాధారణంగా తమ వెంటపడి వేధించే అబ్బాయిలతో అమ్మాయిలు రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాలో హీరో రాఖీలు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. తన వెంటపడిన అమ్మాయిలతో స్పాట్ లోనే రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటనేదే కథ.  టీజర్ చూస్తేనే శ్రీవిష్ణు పాత్ర ద్వారా కావలసినంత కామెడీని అందించనున్నారని తెలుస్తోంది. ఇక లోకల్ మాస్ పార్టీ లీడర్ లుక్ తో వెన్నెల కిశోర్ కనిపిస్తున్నాడు.  గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన వాట్‌ టు డు (What to do Song) సాంగ్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బిగిల్‌ ఫేం రెబా మోనికా జాన్‌   ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది భళా తందనాన, అల్లూరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. ఈ సారి సామజవరగమన సినిమాతో ఎలాంటి బ్రేక్‌ అందుకుంటాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పక్కా ఫన్‌ రైడ్‌తో ఉండబోతున్నట్టు తెలిసిపోతుంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?