నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావా... విజయ్ వర్మ మీద గొడవకు దిగిన బాలీవుడ్ నటుడు!

By Sambi Reddy  |  First Published Apr 27, 2023, 12:27 PM IST


తమన్నా-విజయ్ వర్మల వ్యవహారం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా ఉంది. వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 


హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల వాదన. కొద్దినెలలుగా నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. 2023 న్యూ ఇయర్ వేడుకలు జంటగా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు. నేను సింగిల్ అని సమాధానం చెబుతున్నారు. కానీ ఆమె చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. 

ఇంత రచ్చ జరుగుతుంటే మరోసారి తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. చేసేసి లేక తమన్నా నవ్వుతూ హాయ్ చెప్పారు. విజయ్ డ్రైవింగ్ చేస్తుండగా, పక్క సీట్లో తమన్నా కూర్చొని ఉంది. ఈ క్రమంలో తమన్నా, విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు నిజమే అని పలువురు వాదిస్తున్నారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే విజయ్ వర్మ నటించిన వెబ్ సిరీస్ దహాడ్ ట్రైలర్ మే 3న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో విజయ్ వర్మ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోకి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇచ్చిన కామెంట్ సంచలనమైంది. ఆయన విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. 'నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావా?.. ఎంత దెబ్బతీశాయి విజయ్. ఇంకా నయం నా పరువు తీయలేదు. లేదంటే ఏం జరిగేదో... దేవుడా' అని కామెంట్ పెట్టాడు. 

గుల్షాన్ దేవయ్య కామెంట్ తమన్నా-విజయ్ వర్మ ఎఫైర్ ధృవీకరిస్తున్నట్లు గా ఉంది. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు ఓపెన్ గా చెప్పేస్తే పోతుంది కదా.. అని పలువురు తమన్నాకు సలహా ఇస్తున్నారు. తమన్నా స్టార్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలారు. ముఖ్యంగా తెలుగులో ఆమె తిరుగులేని స్టార్డం అనుభవించారు. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జంటగా  భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. దసరా కానుకగా భోళా శంకర్ విడుదల కానుంది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Varma (@itsvijayvarma)

click me!