పాప్యులర్ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ అకాల మృతి! 

Published : Aug 15, 2022, 09:49 PM IST
పాప్యులర్ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ అకాల మృతి! 

సారాంశం

పాప్యులర్ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం అకాల మృతి చెందారు. దీంతో పరిశ్రమలో విషాదం నెలకొంది .క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జీవితం నీటి బుడగ లాంటిదన్న మాట అక్షరాలా నిజం. యుక్త వయసులోనే అకాల మరణాలు సంభవిస్తుండగా... ఎవరి జీవితం ఎప్పుడు? ఎలా ముగుస్తుందో అర్ధం కావడం లేదు. ఈ మధ్య కాలంలో కొందరు స్టార్స్, పొలిటీషియన్స్ అతి తక్కువ ప్రాయంలోనే మరణించారు. నిరంతర వ్యాయాయం, ఆరోగ్యం అంటే శ్రద్ధ కలిగిన వారు కూడా గుండె పోటుకు గురికావడం కలవర పెడుతుంది. 

తాజాగా కోలీవుడ్ కి చెందిన ట్రేడ్ అనలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం పొందారు. కార్డియాక్ అరెస్ట్ కి గురైన కౌశిక్ కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఒక యువ ఫిల్మ్ క్రిటిక్ అర్థాంతరంగా తనువు చాలించడంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తోటి క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు