విజయ్ దేవరకొండ యాటిట్యూడ్... టేబుల్ పై కాళ్ళు పెట్టి కూర్చున్న రౌడీ హీరో 

Published : Aug 15, 2022, 07:40 PM IST
విజయ్ దేవరకొండ యాటిట్యూడ్... టేబుల్ పై కాళ్ళు పెట్టి కూర్చున్న రౌడీ హీరో 

సారాంశం

విలేకర్ల సమావేశంలో విజయ్ దేవరకొండ ఎదురుగా ఉన్న టేబుల్ పై రెండు కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. ప్రెస్ అడిగే ప్రశ్నలకు అలాగే సమాధానం చెబుతాను అన్నాడు. ఆయన తీరు చూసి జర్నలిస్ట్స్ షాక్ తిన్నారు.

లైగర్(Liger) మూవీ మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నేడు హైదరాబాద్ లో లైగర్ టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కూర్చున్న విధానం హాట్ టాపిక్ అయ్యింది. అతడు ఎదురుగా ఉన్న టేబుల్ పై రెండు కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం వివాదాస్పదమైంది. 

దీని గురించి ఓ విలేకరి అడగడం కూడా జరిగింది. దానికి మీరు కూడా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చొని ప్రశ్నలు అడగవచ్చని విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సమాధానం చెప్పాడు. యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయ్ దేవరకొండకు ఇలాంటి చర్యలు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ మీడియా ముందు మాత్రం పద్ధతిగా ప్రవర్తిస్తున్న విజయ్ దేవరకొండ, తెలుగు మీడియా విషయంలో టెక్కు చూపిస్తున్నాడు. 

సాధారణంగా విజయ్ దేవరకొండకు జర్నలిస్ట్స్ అంటే ఏమాత్రం గౌరవం ఉండదు. నిరాధారమైన కథనాలు రాస్తారంటూ ఆయన మండిపడ్డ సందర్భాలు అనేకం. ఈ క్రమంలోనే ఆయన నేడు అలా ప్రవర్తించాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ రేంజ్ యాటిట్యూడ్ చూపించిన దాఖలాలు లేవు. విజయ్ దేవరకొండ మాత్రం నా రూటే సపరేట్ అంటున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ... నా తాత తెల్వదు, నాన్న తెల్వదు, ఎవ్వడూ తెలియదు... కానీ మీరు నన్ను ఇంతగా అభిమానిస్తున్నారని కామెంట్ చేశాడు. 

ఇది టాలీవుడ్ స్టార్ కిడ్స్ ని ఉద్దేశిస్తూ నెపోటిజం పై వేసిన సెటైర్ గా చాలా మంది భావించారు. నటుడు బండ్ల గణేష్ దీనిపై స్పందించడం జరిగింది. తాతలు తండ్రులు ఉన్నంత మాత్రాన స్టార్స్ కారు బ్రదర్, టాలెంట్ ఉండాలి అంటూ కౌంటర్ వేశాడు. ఆ విషయం పక్కన పెడితే లైగర్ ఆగస్టు 29న విడుదల కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌