జూన్ 16న పూర్ణ అవంతిక

Published : May 30, 2017, 01:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
జూన్ 16న పూర్ణ అవంతిక

సారాంశం

పూర్ణ లీడ్ రోల్ లో తెరకెక్కిన అవంతిక ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న అవంతిక కె.ఆర్. ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవంతిక

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా పూర్ణ ప్రత్యేక పాత్రలో కె.ఆర్. ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బల్ల దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం అవంతిక. ఈ చిత్రం పక్కా ప్లానింగ్ తో జూన్ 16న ప్రపంచ వ్యాప్తాంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. భీమవరం టాకీస్ లో వస్తున్న 90వ చిత్రమిది. పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో  అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.

 

అరుంధతి, అమ్మోరు, రాజు గారి గది తరహాలో  గ్రాఫిక్స్ వర్క్ తో కూడుకున్న చిత్రమిది. ఈ చిత్రంలో 35 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు క్లాప్ తో ప్రారంభమైన ఈ చిత్రం మాజీ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కావడం ఈ చిత్రానికి ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది.

 

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధ మయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. పూర్ణ, గీతాంజలి, కొబ్బరిమెట్ట ఫేం శ్రీ రాజ్, షియాజి షిండే, షకలక శంకర్, ధనరాజ్, అజయ్ ఘో ష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, పాటలు: భారతీ బాబు, ఎడిటింగ్: శివ వై ప్రసాద్, మ్యూజిక్: రవి బల్ల, కథ- మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీ రాజ్ బల్ల, నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.

PREV
click me!

Recommended Stories

తనూజ వల్ల ఇంట్లో 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టి భార్య.. దూరంగా ఉండమని చెప్పి, ఏం జరిగిందంటే
Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?