విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!

Published : Nov 09, 2021, 08:05 AM IST
విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!

సారాంశం

తాజాగా పూనమ్ కౌర్ విడాకుల  గురించి  చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సమంత (Samantha) -నాగ చైతన్య విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

సంచలన ట్వీట్స్, కామెంట్స్ కి పూనమ్ కౌర్ కేర్ ఆఫ్ అడ్రెస్. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ని టార్గెట్ చేస్తూ ఆమె చేసే సోషల్ మీడియా కామెంట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ఆమెకు అన్యాయం చేశారనే ఓ రూమర్ ఉండగా, వాళ్ళిద్దరిపై పరోక్షంగా ట్వీట్స్ వేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. నటిగా కంటే  వివాదాల కారణంగా ఆమె ఫుల్ ఫేమస్ అయ్యారు. 

తాజాగా ఆమె విడాకుల  గురించి  చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 
పూనమ్ (Poonam kaur) తన ట్వీట్ లో ‘విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా? లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా?'' అంటూ కొన్ని ప్రశ్నలు సంధించింది. కారణం ఏమిటో కానీ, కాసేపటికే ఆ ట్వీట్ ని ఆమె డిలీట్ చేశారు. 

సమంత (Samantha) -నాగ చైతన్య విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు పూనమ్ ట్వీట్ ద్వారా సమంతకు సప్పోర్ట్ చేస్తుందో, నాగ చైతన్యకు సప్పోర్ట్ చేస్తుందో అర్థం కాలేదు. భార్యలు భర్తలను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఓ అపోహ సమాజంలో నాటుకుపోయిందని, చెప్పి ఆమెను సమంతను సమర్ధించారు. అదే సమయంలో విడాకుల బాధ మగవాళ్లకు ఉండదా? అని ఎందుకు అనుమానం వ్యక్తం చేశారో అర్థం కాలేదు. నిజానికి ఆమె ట్వీట్స్ ఇలానే నర్మగర్భంగా ఉంటాయి. 

Also read Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి
ఇక సమంతతో చైతన్య (Naga chaitanya) విడాకుల వ్యవహారం మూడు నెలలుగా నడుస్తుంది. వారిద్దరూ విడాకులు ప్రకటించి నెలరోజులు దాటిపోయింది. అయినా మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా సమంత చేసే కొన్ని పోస్ట్స్, కామెంట్స్ కూడా కథనాలు, వార్తలు పుట్టుకురావడానికి కారణం అవుతున్నాయి. 

Also read Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ షాకింగ్‌ కామెంట్‌.. ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే
మరోవైపు సమంత ఈ బాధ నుండి సాధారణ స్థితికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం సమంత  స్నేహితులతో గడుపుతున్నారు. విహారాలలో పాల్గొంటున్నారు. తాజాగా సమంత దీపావళి వేడుకలను రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్