ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? నెటిజన్ పై పూనమ్ ఫైర్!

Published : Oct 06, 2018, 12:35 PM IST
ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? నెటిజన్ పై పూనమ్ ఫైర్!

సారాంశం

నటిగా పూనమ్ కౌర్ కి సరైన బ్రేక్ దక్కలేదు. ప్రస్తుతం ఫోటోషూట్లతో కాలం గడుపుతున్న ఆమె ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్లు వివాదాలకి దారి తీశాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

''ఆంధ్ర, తెలంగాణా.. మన వాళ్లే గొడవ పడుతూ ఉంటే లాభం ఎవరికి..? నాకైతే ఏం అర్ధం కావడం లేదు. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకొచ్చింది'' అంటూ రెండు పిల్లుల తగాదాను కోతి తీర్చిన ఫోటోని పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ''ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? చాలా ఇమెచ్యూర్డ్‌ పొలిటికల్ ట్వీట్ ఇది. మీరు ఎంత అన్నా.. మీ వల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు'' అని ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పూనమ్.. ''నువ్వు ఎవరి డీపీ(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) పెట్టుకున్నావో.. ఆయన విలువైనా తీయకు. ఇదేమైనా సినిమానా పంచ్ లు వేయడానికి..?'' అంటూ సదరు నెటిజన్ కి క్లాస్ తీసుకుంది!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్