బ్రహ్మానందం డౌన్ ఫాల్ కి కారణమేంటంటే..?

Published : Oct 06, 2018, 11:39 AM IST
బ్రహ్మానందం డౌన్ ఫాల్ కి కారణమేంటంటే..?

సారాంశం

ఒకప్పుడు కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు.. స్టార్ హీరోలు సైతం ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. రచయితలు ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని ట్రాక్ లు రాసుకునేవారు. అంతగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపిన బ్రహ్మానందం గత కొంతకాలంగా సినిమాలలో కనిపించడం లేదు.

ఆయన కామెడీ బోర్ అయిపోయిందని దర్శకులు పక్కన పెట్టేశారా..? లేక బ్రహ్మానందం కావాలనే సినిమాలు తగ్గించారా..? అనే విషయంపై ప్రేక్షకుల్లో సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించారు బ్రహ్మానందం. ''నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నాను.

ఇబ్బందిగా అనిపించేవి పక్కన పెట్టేస్తున్నాను. నేనుఇటీవల సినిమాలు తగ్గించిన మాట నిజమే.. దానికి కారణం నేనే అన్ని సినిమాలు చేసేయాలని అనుకోవడం లేదు. నా తరువాత వచ్చే వాళ్లని కూడా చేయనివ్వాలని అనుకుంటున్నాను.

ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించాను. ప్రేక్షకులను నవ్వించాను. ఇంకా సినిమాలను పట్టుకొని వేలాడుతూ.. మిగిలిన వాళ్లు ఏమైపోయినా అనవసరమని నేను అనుకోలేను. అందరికీ గుర్తింపు రావాలి. లివ్ అండ్ లెట్ లివ్ అనేది తన సిద్ధాంతమని'' అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో