`వాల్తేర్‌ వీరయ్య` నుంచి `పూనకాలు లోడింగ్` సాంగ్‌ ఔట్‌.. చిరు, రవితేజ కలిసి పూనకాలు తెప్పించారా?

Published : Dec 30, 2022, 06:32 PM IST
`వాల్తేర్‌ వీరయ్య` నుంచి `పూనకాలు లోడింగ్` సాంగ్‌ ఔట్‌.. చిరు, రవితేజ కలిసి పూనకాలు తెప్పించారా?

సారాంశం

`వాల్తేర్‌ వీరయ్య` సినిమాలోని నాల్గో పాట `పూనకాలు లోడింగ్‌` విడుదలైంది. చిరంజీవి, రవితేజ కలిసి మాస్‌ స్టెప్పులేసిన పాటని ఈ సాయంత్రం విడుదలై ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచారు. వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదల కాగా, తాజాగా మరో పాటని విడుదల చేశారు. `పూనకాలు లోడింగ్‌` పేరుతో వచ్చే పాటని శుక్రవారం సాయంత్రం `సంధ్య` థియేటర్ లో మెగా అభిమానుల మధ్య రిలీజ్‌ చేసింది యూనిట్‌. ప్రస్తుతం ఈ పాట విడుదలై ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఇక ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. రోల్ రైడా, దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి ఈ పాటని రాశారు. రామ్‌ మిర్యాల, రోల్‌ రైడా ఆలపించారు. ఇందులో చిరంజీవి, రవితేజ ఇద్దరూ కనిపించడం విశేషం. చిరంజీవి, రవితేజ కలిసి మాస్‌ పాటకి స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూనకాలు లోడింగ్‌ అంటూ ఇద్దరూ ఇందులో కాస్త గాత్రం కలిపారు. మాస్‌ డాన్సులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ పాట దుమ్ము రేపుతుంది. 

ఇదిలా ఉంటే `పూనకాలు లోడింగ్‌` పాట ఆశించిన స్థాయిలో లేదనే టాక్‌ వినిపిస్తుంది. పాటలోనే పూనకాలు ఉందని, పూనకాలు తెప్పించేలా పాట లేదనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన పాటల్లో ఏదీ బంపర్‌ హిట్‌ అనే సాంగ్‌ రాలేదని మెగా ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. దానికితోడు ఇప్పుడు ఆహో, ఓహో అనిపించిన `పూనకాలు లోడింగ్‌` కూడా ఆ స్థాయిలో లేదనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. మరి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది చూడాలి. కానీ దేవిశ్రీ ప్రసాద్‌ మాత్రం మెగాస్టార్‌ రేంజ్‌ పాటలివ్వలేదనేది వాస్తవం. 

చిరంజీవి, రవితేజ హీరోలుగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రొటీన్‌ కథతోనే సినిమా సాగుతుందని, ఓల్డ్ ఫ్లేవర్‌లోనే ఉంటుందని, కాకపోతే ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందని చిరంజీవి ఇటీవల చెప్పిన విషయంతెలిసిందే. అదే సమయంలో ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, దాన్ని మించి ఉంటుందని కూడా తెలిపారు. మరి ఫలితం ఎలా ఉంటుందనేది తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సిందే.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే