ఆరెండు విషయాలు నేర్చుకున్నా.. బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Dec 30, 2022, 04:17 PM IST
ఆరెండు విషయాలు నేర్చుకున్నా.. బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

చిత్తూరులో సందడి చేసింది బిగ్ బాస్ బ్యూటీ గీత రాయల్ . అక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. తన యాసతో అందరి మనసుల్ని దోచేసింది. 

హలో చిత్తూర్ అంటూ సందడి చేసింది బిగ్ బాస్ బ్యూటీ గీతు రాయల్ .  హయ్ చిత్తూర్.. నాయనా మీ అభిమానం సల్లంగుండా అంటూ అందరి మనసుల్ని దోచేసింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన తానా  చైతన్య స్రవంతి కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో గీతును సన్మానించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా మాట్లాడిన గీతూ.. వారికి కృతజ్ఞతలు తెలిపింది. 

అంతే కాదు గీతూ మాట్లాడుతూ.. చిత్తూరు ఆడియన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. మీ అభిమానం చూస్తుంటే నా వల్ల కావడంలేదు రా నాయనా అంటూ.. అందరికి థ్యాంక్స్ చెప్పింది. నేను చిత్తూరు నుంచి బయటకు వెళ్లి 15 ఏళ్లు అవుతుంది అయినా కూడా నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు. నేను చిత్తూరును వదిలినా...నా బ్లడ్ లో మాత్రం మన యాసను ఎక్కించుకుని ఉన్నాను.. ఎక్కడికి వెళ్లినా చిత్తూరు యాసలోనే పూర్తిగా మాట్టాడుతున్నాను అన్నది  గీతు. 

అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా.. మీది ఏ ఊరు అని అడిగితే..మాది చిత్తూరు అంటూ గర్వంగా చెపుతానంటోంది గీతురాయల్. అంతే కాదు బిగ్ బాస్ వల్ల తనకు సెకండ్ లైఫ్ వచ్చిందని. బిగ్ బాస్ షోకి వెళ్లి తాను రెండు విషయాలు నేర్చుకున్నాను అంటోంది. తప్పు లేకుంటే ఎవరినైనా.. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఎదిరించి నిలవాలి.. కాని తప్పు మనవైపు ఉంటే మాత్రం చిన్న పిల్లోడికి  అయినా సరే క్షమాపన చెప్పాలి. అంటూ ఎమోషనల్ అయ్యింది గీతూ 

ఇక తనను ఇలా గుర్తించి.. బిగ్ బాస్ లో ఆదరించి నా ఇమేజ్ ను పెంచేసిన  ఆడియన్స్ కు.. బిగ్ బాస్ లో తనకు ఓటు వేసిన అభిమానులకు జీవితాంత రుణపడి ఉంటానంటోంది గీతు. ఇక గీతూ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో గీతుకు ఘనంగా సన్మనం చేశారు నిర్వహకులు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?