బోల్డ్ పాత్రల్లో నటించడానికి రెడీ: బిగ్ బాస్ బ్యూటీ!

By Udaya DFirst Published Feb 7, 2019, 9:41 AM IST
Highlights

బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎస్ఎస్ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ మొదలుపెట్టింది

బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎస్ఎస్ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ మొదలుపెట్టింది.

కెరీర్ ఆరంభంలోనే తోటి వీజేతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా అతడి నుండి విడిపోయింది. అనంతరం నటుడు జాన్ కొక్కెన్ తో ఆమె సన్నిహితంగా ఉంటుందని, ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తమ మధ్య ఉన్న రిలేషన్ స్నేహం మాత్రమేనని అంటోంది పూజా. ఒకే ఫీల్డ్ లో ఉండడం వలన రకరకాల పుకార్లు పుట్టుకొస్తాయని వాటిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పింది. మొదట్లో నటన విషయంలో కాస్త బెరుకుగా ఉండేదాన్ని అని, ఇప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉందన్నారు. 

ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధమని అంటోంది. ఇందులో గ్లామర్ పాత్రలు వచ్చినా, బోల్డ్ పాత్రలు వచ్చినా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈరోజుల్లో బోల్డ్ నెస్ కామన్ అయిందని, కథ డిమాండ్ చేసినప్పుడు అలాంటి బోల్డ్ పాత్రకు తను సిద్ధమని చెప్పుకొచ్చింది. 

click me!