
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) బుల్లి తెరపై యువరాణిలా మెరుపులు మెరిపించబోతోంది. వెండితెరపై వెలుగు వెలుగుతున్న మహరాణి.. సరిగమస్వరాల పలకబోతోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముందు వరసలో ఉన్న పూజా హెగ్డే (Pooja Hegde). కెరీర్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ వెళ్తోన్న పూజా.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ పై కూడా గట్టిగా ఫోకస్ చేసింది. తన కెరీర్ కు ఉపయోగపడే ఏ ఛాన్స్ ను వదిలిపెట్టడం లేదు పూజా హెగ్గే (Pooja Hegde). రీసెంట్ గా స్మాల్ స్క్రీన్ పై కూడా మెరిసిపోయింది.
జీ తెలుగులో ప్రసారం కాబోతున్న సరిగమప ద సింగింగ్ సూపర్ స్టార్స్ ప్రోగ్రాం కు సంబంధించి రీసెంట్ ప్రోమో ప్రసారం అయ్యింది. ఈనెల 20 నుంచి ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమం మొదటి గెస్ట్ గా పూజా హెగ్డే (Pooja Hegde) పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టిట్లో వైరల్ అవుతుంది. గాయనీ..గాయకులు మధుర స్వరాలతో పాటు..పూజా హెగ్డే (Pooja Hegde) బ్యూటీ కూడా ఈ కార్యక్రమానికి హైలెట్ అట్రాక్షన్ అయ్యింది.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సీనియర్ సింగర్ శైలజతో పాటు పాటల రచయిత అనంత్ శ్రీరామ్, మరో సింగర్ స్మిత ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. యంగ్ సింగర్స్ అంతా మెంటర్స్ గా ఉన్న ఈ కార్యక్రమంలో నూతన గాయకులు దుమ్ము రేపబోతున్నారు. అయితే ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోర్ కు పూజా హెగ్డే (Pooja Hegde) హైలెట్ అవ్వనున్నారు.
ప్రోమోలో పూజా (Pooja Hegde) ఎంట్రీ అదిరిపోయింది. క్యూట్ లుక్స్ తో.. బుగ్గమీద సొట్ట పడేలా చిరునవ్వులు చిందిస్తూ.. పూజా హెగ్డే(Pooja Hegde) ఎంట్రీ ఇవ్వడంతోనే అందరూ షాక్ అయ్యారు. అంతే కాదు టాలీవుడ్ అందం తమ ముందు నిలుచునే సరి మైమరచిపోయారు కుర్రళ్ళు. పోటీ పడి పూజా హెగ్డే (Pooja Hegde) కు ప్రపోజ్ చేశారు. రకరకాలుగా ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. ఇక కొత్త గాయకుల పాటలు విన్న స్టార్ బ్యూటీ.. వారి పాటలకు మురిసిపోయింది. షో మొత్తంగా ఆమె సూపర్ గా ఎంజాయ్ చేసినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది.