పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!

Published : Sep 08, 2022, 10:05 AM ISTUpdated : Sep 08, 2022, 10:26 AM IST
పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!

సారాంశం

రాధే శ్యామ్ మూవీతో మొదలైన ఆమె ప్లాప్స్ పరంపర ఆచార్య వరకు కొనసాగింది. బీస్ట్, ఆచార్య డిజాస్టర్స్ కాగా.. ప్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసింది. అయినా పూజాకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిణామంతో మేకర్స్ ఆమె అంటే భయపడుతున్నారు. 

కెరీర్ బిగినింగ్ నుండి పూజా హెగ్డేకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఉంది. ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే సినిమా గోవిందే. త్రివిక్రమ్ కాంపౌండ్ లోకి వచ్చే వరకు పూజా నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్. ఇక కెరీర్ ముగిసింది అనుకుంటున్న తరుణంలో దర్శకుడు త్రివిక్రమ్ కంట్లో పడింది. ఆమెలోని టాలెంట్ ని గుర్తించిన త్రివిక్రమ్ పిలిచి మరీ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోగా... దశ తిరిగింది. వరుస హిట్స్ తో ఐరన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ ట్యాగ్ తెచ్చుకుంది. అయితే మరలా సెంటిమెంట్ తిరగబడింది. పూజా కథ మొదటికి వచ్చింది.

రాధే శ్యామ్ మూవీతో మొదలైన ఆమె ప్లాప్స్ పరంపర ఆచార్య వరకు కొనసాగింది. బీస్ట్, ఆచార్య డిజాస్టర్స్ కాగా.. ప్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసింది. అయినా పూజాకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిణామంతో మేకర్స్ ఆమె అంటే భయపడుతున్నారు. పూజా హీరోయిన్ గా ఉన్న జనగణమన మూవీ మధ్యలోనే అటకెక్కింది. లైగర్ మూవీ ప్లాప్ కావడంతో జనగణమన నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయారు. జనగణమన ఆగిపోయిందని విశ్వసనీయ సమాచారం. 

ఇదంతా పూజా ఐరన్ లెగ్ మహిమే అంటున్నారు. పూజా బ్యాడ్ సెంటిమెంట్ కి విజయ్ దేవరకొండ బలయ్యాడు అంటున్నారు. నిజానికి పూజా కూడా ఈ ప్రాజెక్ట్ తో బాగా నష్టపోయింది. జనగణమన చిత్రానికి పూజా ఏకంగా రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఒక షెడ్యూల్ పూర్తయ్యేక సినిమా ఆగిపోయింది. పూజా అడ్వాన్స్ రూపంలో ఎంత తీసుకున్నారో తెలియదు కానీ, జనగణమన ఆగిపోవడం వలన ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ కోల్పోయింది. 

ఈ క్రమంలో పూజా అంటే మేకర్స్ వణుకుతున్నారు. పూజా హీరోయిన్ గా అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. ఏపీలో ఎన్నిక హీట్ మొదలు కాగా... ఇక భవదీయుడు ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం జరగని పని . 
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు