
సినీ తారలకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఏమాత్రం ఫిట్‌నెస్ కోల్పోయినా, షేపౌట్ అయినా వెండితెరపై వారిని చూసేందుకు ఆడియెన్స్ ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకోసమే టైమ్ దొరికితే జిమ్‌లో, ఫిట్‌నెస్ సెంటర్లలో గడుపుతుంటారు. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు. చెమటోడుస్తుంటారు. బాడీని ఫిట్‌గా, పర్‌ఫెక్ట్ కర్వ్ తో మెయింటేన్ చేసేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు.
హీరోయిన్లకి అందమే పెద్ద అసెట్. యాక్టింగ్ ఎలా ఉన్నా ఫస్ట్ ఆడియెన్స్ చూసేది హీరోయిన్ల అందమే. తెరపై బాగా నాజుగ్గా కనిపించారా? ఎంత హాట్‌గా, గ్లామర్‌గా ఉన్నారనేది మెయిన్ ఫోకస్ చేస్తుంటారు. అందుకే మేకర్స్ కూడా సినిమాల్లో హీరోయిన్ల అందంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఈ విషయంలో హీరోయిన్లు కూడా తగ్గేదెలే అని నిరూపించుకుంటారు. గ్లామర్ డోస్‌పెంచుతూ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంటారు. తమ అందాలతో చిత్తు చేస్తుంటారు. అందుకోసమే వర్కౌట్స్ చేస్తూ తమ బాడీని పర్‌ఫెక్ట్ గా ఉంచుకుంటారు. ఈ విషయంలో బుట్టబొమ్మ(Pooja Hegde) ఓ అడుగు ముందే ఉంటుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని పూజా హెగ్డే, బాడీ మెయింటనెన్స్ లోనూ రాజీపడదు.
అందులో భాగంగా తాజాగా ఆమె వర్కౌట్ చేస్తూ కనిపించింది. షూటింగ్ ల నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది Pooja Hegde. జిమ్ సెంటర్‌లో వర్కౌట్ చేస్తూ కష్టపడుతుంది. పాపులర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ సమీర్ పురోహిత్ ఆధ్వర్యంలో ట్రైన్ అవుతుంది పూజాహెగ్డే. స్లో మోషన్ వర్కౌట్(Pooja Workout) చేస్తూ కనిపించింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది పూజా. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఈ స్లోమోషన్ వర్కౌట్స్ వల్ల ఎనర్జీ, స్ట్రెంన్త్ ని పొందడం సాధ్యమంటుంది పూజా. `స్లో అండ్ కంట్రోల్డ్ మూవ్‌మెంట్.. మీరు కూడా నెక్ట్స్ టైమ్ ట్రై చేయండి` అని పోస్ట్ పెట్టింది. దీని వల్ల బాడీ ఫిట్‌గా, అందంగా తయారవ్వడంతోపాటు కావాల్సిన ఎనర్జీ జనరేట్ అవుతుందని తెలిపింది పూజా.
ఇదిలా ఉంటే కెరీర్ పరంగా పూజా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమెని మించిన స్టార్ హీరోయిన్ లేరంటే అతిశయోక్తి కాదు. టాప్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ పూజా. ప్రస్తుతం ఆమె నటించిన `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అలాగే మున్ముందు పవన్ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్`, బన్నీతో ఓ సినిమా చేయబోతుంది.