ప్రకాష్ రాజ్ పై కృష్ణవంశీ కామెంట్స్.. చాలా పెద్ద మాట అనేశాడే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 07, 2022, 03:58 PM IST
ప్రకాష్ రాజ్ పై కృష్ణవంశీ కామెంట్స్.. చాలా పెద్ద మాట అనేశాడే

సారాంశం

సౌత్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణ వంశీకి కొన్నేళ్లుగా మంచి సక్సెస్ లేదు. దీనితో కృష్ణవంశీ తనని తాను నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

సౌత్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణ వంశీకి కొన్నేళ్లుగా మంచి సక్సెస్ లేదు. దీనితో కృష్ణవంశీ తనని తాను నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో క్రేజీ నటీనటులంతా నటిస్తున్నారు. 

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా పరిస్థితుల వల్ల ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

ప్రస్తుతం కృష్ణ వంశీ కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ని నట రాక్షసుడిగా అభివర్ణించాడు. 'రంగమార్తాండ చిత్రం చివరి దశకు చేరుకుంది. నేను అభిమానించే నటుడు, నట రాక్షసుడు ప్రకాష్ రాజ్ తో మోస్ట్ ఎమోషనల్ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నా.. స్టన్నింగ్' అని చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ. 

రంగమార్తాండ చిత్రం మరాఠీలో విజయం సాధించిన 'నట సామ్రాట్' అనే చిత్రానికి రీమేక్ ఇది. కృష్ణవంశీ చివరగా తెరకెక్కించిన 'నక్షత్రం' చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో రంగమార్తాండ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనే పట్టుదలతో కృష్ణవంశీ ఉన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి నటులుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్