
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆల్రెడీ భీమ్లా నాయక్ సందడి మొదలై ఉండేది. కానీ భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 25కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాల కోసం భీమ్లా నాయక్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావడంతో ఆ చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో రష్యాకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన పిల్లలతో ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. దీనితో పవన్ క్రిస్టమస్ వేడుకల కోసం రష్యా వెళ్లారు. ఇన్నిరోజులు భార్య పిల్లలతో గడిపిన పవన్ తాజాగా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.
కొత్తగా స్మార్ట్ లుక్ తో పవన్ కళ్యాణ్ దర్శనం ఇస్తున్నాడు. దీనితో పవన్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ లుక్ అదిరిపోయేలా ఉందంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తన షూటింగ్స్, రాజకీయ కార్యక్రమాలతో బిజీ కాబోతున్నారు.
భీమ్లా నాయక్ చిత్రం చివరి దశకు చేరుకుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. సో పవన్ కళ్యాణ్ 2022 క్యాలెండర్ ఫుల్ బిజీ అన్నమాట.
ఇవి కాక పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా కమిటై ఉన్నాడు. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్, రానా కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే సాంగ్స్ అందించారు. పవన్ ని మాస్ అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.