ఈ పాటలో డ్యాన్సులకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించింది..పూజా హెగ్డే

Published : Mar 15, 2018, 11:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఈ పాటలో డ్యాన్సులకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించింది..పూజా హెగ్డే

సారాంశం

పూజా హెగ్డే ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న భామ దువ్వాడ జగన్నాధం మూవీలో బికినీలో కనిపించి చూపించిన అందాలతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చేసింది ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు సినిమాల్లో ఒకేసారి హీరోయిన్ గా నటించేస్తోందంటే పూజా హెగ్డే స్పీడ్ అర్ధమవుతుంది.

పూజా హెగ్డే ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న భామ. అంతకు ముందే తెలుగు సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు చేసినా.. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం మూవీలో బికినీలో కనిపించి చూపించిన అందాలతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చేసింది. చకచకా సినిమాలు సైన్ చేసి పారేసింది. ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు సినిమాల్లో ఒకేసారి హీరోయిన్ గా నటించేస్తోందంటే పూజా హెగ్డే స్పీడ్ అర్ధమవుతుంది.

మరోవైపు ఈ బ్యూటీ ఐటెం సాంగ్ లో కూడా నటించేసింది. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం మూవీలో పూజా హెగ్డే ఓ పెప్పీ సాంగ్ చేసింది. సుకుమార్ తీస్తున్న ఐటెం సాంగ్.. పైగా రాంచరణ్ నటిస్తున్న మూవీ.. అందులోనూ ఐటెం బీట్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం.. వీటన్నటికి తోడు పూజా హెగ్డే అందాలు తోడయితే.. నా సామిరంగా ఆ పాట ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే.. కాళ్లు తమంతట తామే డ్యాన్సులు వేసేయడం ఖాయం. మరి ఇప్పటికే ఆ పాట షూటింగ్ కూడా పూర్తి చేసేసిన పూజా హెగ్డే ఈ పాట గురించి ఏం చెబుతోందో తెలుసా?

'విపరీతమైన ఎనర్జీతో సాగే పెప్పీ నంబర్ ఇది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది ఓ డబుల్ షాట్ బ్లాక్ కాఫీ మాదిరిగా ఉంటుంది. ఇన్ స్టంట్ గా ఎనర్జీ నింపేసే పవర్ ఆ పాటకు ఉంది. ఆ బీట్ నా మైండ్ లో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఈ పాటలో డ్యాన్సులకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించేస్తుంది' అంటూ తెగ ఊరించేస్తోంది పూజా హెగ్డే. స్వయంగా క్రేజీ బ్యూటీనే ఇన్ని మాటలు చెబితే.. ఇక మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ కి వెళ్లిపోవాలో?

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్