ఇండస్ట్రీలో మగాళ్లనూ బెడ్ రూంకి రమ్మంటున్నారు

First Published Mar 15, 2018, 10:56 AM IST
Highlights
  • సినీరంగంలో ఆడవాళ్లమీద లైంగికవేధింపులు గురించి అనేక మంది హీరోయిన్లు, నటీమణులు గళమెత్తుతున్నారు
  • అయితే, సినిమా రంగంలో కేవలం ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకూ లైంగికవేధింపులు​ ఉన్నాయంట
  • సరికొత్త సమస్యను తెరమీదకు తెచ్చారు హేట్ స్టోరీ ఫేమ్.. దర్శక నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి​

‘కాస్టింగ్ కౌచ్’.. ‘మీ టూ’ పదాలు ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ ఎక్కువగా వినిపిస్తున్న మాట. సినీరంగంలో ఆడవాళ్లమీద లైంగికవేధింపులు గురించి అనేక మంది హీరోయిన్లు, నటీమణులు గళమెత్తుతున్నారు. అయితే, సినిమా రంగంలో కేవలం ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకూ లైంగికవేధింపులు తప్పడంలేదంటూ సరికొత్త సమస్యను తెరమీదకు తెచ్చారు హేట్ స్టోరీ ఫేమ్.. దర్శక నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. తన బంధువుల అబ్బాయి ఒకరు అమెరికా నుంచి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు వచ్చాడని.. అతన్ని ఓ స్టార్‌ హీరో, దర్శకనిర్మాతకు పరిచయం చేశానని… అయితే వారు అతన్ని లైంగికంగా వేధించారని ఆయన పేర్కొన్నారు.

 

హర్వే వెయిస్టెన్‌లను వెతికి తీస్తే బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోలు, డైరెక్టర్‌లు బయటపడతారంటూ సరికొత్త బాంబు పేల్చారు అగ్నిహోత్రి. నా బందువు అలాంటి వాళ్ల చేతిలో నలిగిపోయిన బాధితుడేనని.. కీచకులకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఎవరికీ లేదు. అందుకు బోలెడంత మంది కంగనా రనౌత్‌లు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుందని వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు. మీటూ ఉద్యమం కేవలం మహిళలకే కాదు, మగాళ్లకీ అందులో చోటుండాలంటూ వివేక్ పేర్కొన్నారు.

click me!