4 లక్షలు టోకరా.. హీరోయిన్ పై కేసు నమోదు

Published : Mar 19, 2019, 07:59 PM ISTUpdated : Mar 19, 2019, 08:59 PM IST
4 లక్షలు టోకరా.. హీరోయిన్ పై కేసు నమోదు

సారాంశం

ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ గుర్తుందా.. ‘దండుపాళ్యం’ సినిమాలో నటించింది. ఆమె ఎప్పుడో ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఆమె  బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోయి మీడియా కు ఎక్కారు.

ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ గుర్తుందా.. ‘దండుపాళ్యం’ సినిమాలో నటించింది. ఆమె ఎప్పుడో ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఆమె  బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోయి మీడియా కు ఎక్కారు. 

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు స్టే చేసారు. ఆ హోటల్ బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యింది. ఆ విషయం  తెలుసుకున్న ఆమె బిల్ పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి పరారి అయ్యిపోయారు. ఈ విషయం గుర్తించిన హోటల్‌ మేనేజ్మెంట్ స్థానిక పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్  చేశారు. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. 

అయితే తాను రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నారు. మొత్తం డబ్బు చెల్లించేందుకు కాస్త టైమ్ ఇవ్వమని హోటల్‌ మేనేజ్మెంట్ ని ఆమె  కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కొన్ని రోజులు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే  పూజా గాంధీ ఇలా గొడవల్లో , వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటి సారి కాదు. 2011లో ఆమె ప్రముఖ నిర్మాత కిరణ్‌తో గొడవ పెట్టుకున్నారు. డబ్బు విషయంలో వీరిద్దరికీ కలహాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ఇద్దరు ఒకరిపై మరొకరు పరువు నష్టం కేసు పెట్టుకున్నారు. 

ఆడియెన్స్ కి షాకిచ్చిన గెస్ట్ రోల్స్ (డైరెక్టర్స్ - యాంకర్స్)

నరసింహుడు డిజాస్టర్ అయినప్పుడు తారక్ ని రెమ్యునరేషన్ తగ్గించమంటే..

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా