అనుష్క శెట్టి (Anushka Shetty) చాలా కాలం తర్వాత ప్రేక్షకులను అలరించబోతోంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి తాజాగా స్వీటీ టీజర్ అప్డేట్ అందించింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ‘జాతిరత్నాలు’ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కలిసి నటిస్తున్న చిత్రం Miss Shetty Mister Polishetty. మూడేండ్ల గ్యాప్ తర్వాత అనుష్క, రెండేండ్ల గ్యాప్ తర్వాత నవీన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా స్వీటీ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అనుష్క, నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలి ఆకట్టుకుంటున్నారు. టైటిల్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్డేట్ అందించింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్ ను విడుదలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆసక్తికరమైన పోస్టర్లను వదులుతూ డేట్, టైమ్ ను అనౌన్స్ చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈరోజు (April 29) సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అనుష్క ఫ్యాన్స్, ఇటు నవీన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనౌన్స్ మెంట్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. స్టాడప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి ఎదుగుతున్నట్టుగా.. చెఫ్ గా అనుష్క కూడా ఎదుగుతున్నట్టు పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. అయితే వీరిద్దరి కథేంటి అనేది తెలియాల్సి ఉంది.
గతంలో వచ్చిన పోస్టర్ ను బట్టి హైదరాబాద్ లో ఉన్న పొలిశెట్టి, లండన్ లో ఉన్న అనుష్క శెట్టిని ఎలా కలిశాడు. ఆ కనెక్షన్ ఎంటనేదే కథగా తెలుస్తోంది. ఫుల్ ఫన్ రైడ్ గా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్ తో మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఆసక్తికరమైన కలయికలో రాబోతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా నీరవ్ షా, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం రధన్ అందిస్తున్నారు. నిర్మాత వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.
The teaser of is about to be served hot at 6 PM...
Stay tuned! 🤩 … pic.twitter.com/OGhTOrieeV