నీలి చిత్రాల కేసు...  శిల్పా శెట్టిని ప్రశ్నించిన పోలీసులు, ఆమె ప్రమేయం ఉందా?

By team teluguFirst Published Jul 24, 2021, 9:16 AM IST
Highlights

నటి శిల్పా శెట్టిని పోలీసులు ప్రశ్నించారు. ఆమె ప్రస్తుతం ఉన్న బంగ్లాకు వెళ్లిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు శిల్పా శెట్టిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ పిటీషన్ ని కోర్టు కొట్టివేసింది. జులై 27 వరకు రాజ్ కుంద్రా కస్టడీని పొడిగించడం జరిగింది. అస్లీల చిత్రాలు చిత్రీకరణ, ప్రదర్శన ఆరోపణలపై రాజ్ కుంద్రా జులై 19న అరెస్ట్ కాబడ్డారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 


కాగా ఈ కేసుకు సంబంధించి నటి శిల్పా శెట్టిని పోలీసులు ప్రశ్నించారు. ఆమె ప్రస్తుతం ఉన్న బంగ్లాకు వెళ్లిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు శిల్పా శెట్టిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. రాజ్ కుంద్రా పాల్పడిన ఈ చట్ట వ్యతిరేక చర్యల గురించి శిల్పా శెట్టికి తెలుసా, ఆమె ప్రమేయం కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

లండన్ కి చెందిన కెర్నిన్ అనే సంస్థలో రాజ్ కుంద్రా యొక్క వియాన్ సంస్థ సంబంధాలు కలిగి ఉంది. ఈ రెండు సంస్థలు పోర్న్ చిత్రాల నిర్మాణం, ప్రదర్శన వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ కుంద్రా నేరానికి పాల్పడినట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తమ క్లయింట్ ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని కుంద్రా తరపు న్యాయవాది వాదిస్తున్నారు. అడల్ట్ కంటెంట్, పోర్న్ కంటెంట్ మధ్య వ్యత్యాసం ఉందని లాయర్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. 

click me!