ఎన్టీఆర్ కొత్త కారు ఖరీదు అన్ని కోట్లా.. ఇంటికి వచ్చిందట?

By team teluguFirst Published Jul 24, 2021, 8:41 AM IST
Highlights

ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నారని సమాచారం. దాదాపు రూ. 5కోట్ల విలువైన ఈ కారును కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ బుక్ చేశారట. అది ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటికి చేరిందట. 
 

ఖరీదైన కార్లను సేకరించడం స్టార్స్ కి అలవాటే... టాలీవుడ్ సూపర్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారు కోట్ల విలువైన లగ్జరి కార్లను కలిగి ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా అత్యంత ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నారని సమాచారం. దాదాపు రూ. 5కోట్ల విలువైన ఈ కారును కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ బుక్ చేశారట. అది ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటికి చేరిందట. 


లాంబోర్గిని కారులో ఎన్టీఆర్ చరణ్ ని కలవడానికి వెళ్లాడని కూడా ఓ వాదనవినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ లాంబోర్గిని కారు కొన్నారన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన సన్నిహితులు అంటున్నట్లు సమాచారం. నిజంగా ఎన్టీఆర్ కారు కొన్నారా లేరా అన్నది, తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. 


మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోగా పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని భాషలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. 
 

click me!