
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటాడు. అదే సమయంలో ఆయన మాటలు కొన్నిసార్లు వివాదంగానూ మారుతుంటాయి. ట్రోల్స్ కి గురవుతుంటాయి. కానీ తాజాగా విజయ్ దేవరకొండ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కంప్లెయింట్ నమోదైంది.
విజయ్ దేవరకొండ ఇటీవల సూర్య నటించిన `రెట్రో` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఇందులో ఆయన ఆదివాసీలను అవమానించారంటూ కిషన్ లాల్ చౌహాన్ అనే లాయర్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కంప్లెయింట్‌ని తీసుకుని విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచ