Chiranjeevi: చిరంజీవి వేవ్ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబులకు దీటుగా రాణించడం కోసం ఆయన ప్రత్యేకంగా ఏం చేశాడో బయటపెట్టారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వేవ్ సమ్మిట్(వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ 2025)లో పాల్గొన్నారు. ముంబయిలోని జీయో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 1న గురువారం జరిగిన ఈ ఈవెంట్‌లో ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల నుంచి వివిధ దిగ్గజాలు హాజరయ్యారు. చిరంజీవి, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, మోహన్‌లాల్, అలియాభట్, రణ్ బీర్ కపూర్, ఇలా చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌ని ప్రధాని మోడి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన మాట్లాడుతూ, తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో తాను ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌ను ఎంటర్టైన్ చేస్తుండేవాడినని తెలిపారు. అలా నటనపై తనకు ఆసక్తి ఏర్పడిందన్నారు చిరు. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో జాయిన్ అయిన చిరు, అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు ఇలా అర డజనుకు పైగా స్టార్ హీరోలున్నారని, అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా? అని అనుకున్నారట.
`అందరి కంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పుడే ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి , స్టంట్స్ విషయంలో అమితాబ్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్పూర్తిగా నిలిచారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు చిరంజీవి.
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన `విశ్వంభర` చిత్రంలో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీగా ఇది తెరకెక్కుతుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కారణంగా రిలీజ్ డిలే అవుతుంది. సెప్టెంబర్‌లో ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. దీంతోపాటు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు మెగాస్టార్.