రష్మి సినిమాపై పోలీస్ కేసు!

Published : Aug 25, 2018, 10:28 AM ISTUpdated : Sep 09, 2018, 01:10 PM IST
రష్మి సినిమాపై పోలీస్ కేసు!

సారాంశం

యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించిన 'అంతకుమించి' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నిర్మాత గౌరీశంకర్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు

యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించిన 'అంతకుమించి' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నిర్మాత గౌరీశంకర్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా సినిమాను విడుదల చేశారని అతడు వాపోతున్నాడు. శ్రీకృష్ణ క్రియేషన్ బ్యానర్ పేరుతో 'అంతకుమించి' టైటిల్ ను రిజిస్టర్ చేశారు గౌరీశంకర్.

సినిమా తీయడం మొదలుపెట్టిన తరువాత ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావడంతో సినిమాను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కమలాపురి కాలనీకి చెందిన సతీష్ జాయ్ తానే హీరోగా, నిర్మాతగా సినిమా పూర్తి చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పటివరకు షూటింగ్ కోసం గౌరీశంకర్ ఖర్చుపెట్టిన మొత్తం రూ.50 లక్షలు సినిమా విడుదలకు ముందే ఇచ్చేస్తానని సతీష్ చెప్పగా ఆయన కూడా నమ్మాడు.

సినిమా పూర్తయి రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాత కూడా అతడికి డబ్బు తిరిగిఇవ్వకపోవడం, గౌరీశంకర్ పలుమార్లు డబ్బు ప్రస్తావన తీసుకొచ్చినా.. పట్టించుకోకపోవడంతో కోర్టుని ఆశ్రయించగా, సినిమా విడుదల ఆపాలని కోర్టు ఆదేశించి. కానీ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా శుక్రవారం సినిమాను విడుదల చేశారు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ గౌరీశంకర్ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్