జగ్గుభాయ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది!

Published : Aug 24, 2018, 06:30 PM ISTUpdated : Sep 09, 2018, 11:09 AM IST
జగ్గుభాయ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది!

సారాంశం

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ ల నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలొచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ మరో బయోపిక్ రెడీ అవుతోంది

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ ల నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలొచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ మరో బయోపిక్ రెడీ అవుతోంది. ఆ బయోపిక్ మరెవరిదో కాదు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఇలా తన కెరీర్ లో ఎన్నో వైవిద్యమైన పాత్రల్లో నటించిన జగపతి బాబు జీవితంపై ఇప్పుడు బయోపిక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది.

జగపతి బాబు కెరీర్ లో చాలా ఎత్తుపల్లాలున్నాయి. నిర్మాత కొడుకైనా.. అతడి కెరీర్ సాఫీగా ఆగలేదు. ఆరంభంలో అతడికి విజయాలు దక్కలేదు. అతడి గొంతు బాగాలేదని మరొకరితో డబ్బింగ్ చెప్పించారు. హీరోగా నిలదొక్కుకోవడానికి జగపతిబాబు ఎంతో కష్టపడ్డారు. గతంలో జగపతిబాబు.. కృష్ణవంశీ దర్శకత్వంలో 'సముద్రం' అనే సినిమాలో నటించారు. ఇప్పుడు జగపతి బయోపిక్ కి అదే పేరుని టైటిల్ గా పెట్టారని తెలుస్తోంది.

అయితే ఈ 'సముద్రం' సినిమాగా కాకుండా.. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో వెబ్ సిరీస్ గా ప్రసారం చేయనున్నారు. మరి ఈ సముద్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్