`ఛావా` సినిమాపై ప్రధాని మోడీ కామెంట్‌, దేశం మొత్తం ఇప్పుడు అదే పని

Published : Feb 22, 2025, 12:01 PM IST
`ఛావా` సినిమాపై ప్రధాని మోడీ కామెంట్‌, దేశం మొత్తం ఇప్పుడు అదే పని

సారాంశం

 PM Modi: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఆయన ఏంచెప్పారనేది ఇందులో తెలుసుకుందాం. 

 PM Modi: విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రారంభం నుంచి హిట్‌ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. అందరూ ఈ సినిమాను పొగుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో  'ఛావా' సినిమా గురించి మాట్లాడి, సినిమాను తెగ పొగిడేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే..

'ఛావా' గురించి మాట్లాడుతూ  'మహారాష్ట్ర, ముంబై మరాఠీ సినిమాలతో పాటు హిందీ సినిమాను కూడా పైకి తీసుకొచ్చాయి. ఇప్పుడు దేశమంతా ఛావా గురించే మాట్లాడుకుంటున్నారు. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఆధారంగా సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని చూపించారు' అని అన్నారు. మోదీ ప్రశంసించారు. పీఎం ప్రశంసలతో సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కలెక్షన్లు కూడా పెరగనున్నాయని సమాచారం. 

 

చిన్న షార్ట్ వేసుకొని బయటకు వచ్చిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఎక్కడ అంటూ కామెంట్స్

సినిమా కథ ఏంటంటే..

'ఛావా' సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం, ఆయన కష్టాల గురించి చెబుతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తన నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. రష్మిక మందన్న మహారాణి యేసుబాయి పాత్రలో బాగా చేసింది. విక్కీ, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటివరకు 310.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను టాక్స్ ఫ్రీ కూడా చేశారు.

read more: `ఛావా` సినిమా చేయాల్సిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? పాపం మూడో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ !

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన