ఆసుపత్రి పాలైన చిరంజీవి తల్లి.. ప్రస్తుతం ఎలా ఉందో మెగాస్టార్‌ క్లారిటీ.. ఏం జరిగిందంటే?

Published : Feb 21, 2025, 07:33 PM ISTUpdated : Feb 21, 2025, 07:34 PM IST
ఆసుపత్రి పాలైన చిరంజీవి తల్లి.. ప్రస్తుతం ఎలా ఉందో మెగాస్టార్‌ క్లారిటీ.. ఏం జరిగిందంటే?

సారాంశం

చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైందని, ఆమె ఆసుపత్రి పాలు అయ్యిందనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.   

చిరంజీవి తల్లి  అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రి పాలయ్యారనే రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రూమర్లకి చెక్‌ పెడుతూ అసలేం జరిగిందో తెలిపారు. తన తల్లి  అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యిందని మీడియాలో కథనాలు నా దృష్టికి వచ్చాయని, అయితే అది నిజమే అని ఆయన తెలిపారు. 

అమ్మ రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురయ్యిందని, ఇప్పుడు ఆమె అన్ని రకాలుగా బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి ఆరోగ్యంగానే ఉంద. అమ్మ అనారోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని చిరంజీవి తెలిపారు. ఈ పరిస్థితి అర్థం చేసుకుంటున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

చిరంజీవి తల్లి  అంజనాదేవి ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ గురించి ఓఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లో సురేఖ, ఉపాసనలు చేస్తున్న `అత్తమ్మ కిచెన్‌`(పచ్చళ్ల)కి సపోర్ట్ చేస్తుంటుంది. 70ఏళ్లకి చేరువలో ఉన్న చిరంజీవి అమ్మ ఏజ్‌ సుమారు 90కిపైగానే ఉంటుంది. ఆమెకి ఐదుగురు సంతానం. చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now.

Appeal to all media not to publish any speculative reports…

ఇక చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఇది రూపొందుతుంది. దీంతోపాటు మరో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ఇక నాగబాబు సీరియల్స్‌, సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. మరోవైపు ఎన్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. చిన్నకుమారుడు పవన్‌ కళ్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అటు సినిమాలు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉంటున్నారు. ఇటీవలే జనవరి 29న అంజనమ్మ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సందడిగా సెలబ్రేట్‌ చేశాడు చిరంజీవి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు