రజినీతో పేట డైరెక్టర్ మరో చిత్రం!

Published : Feb 08, 2021, 03:15 PM IST
రజినీతో పేట డైరెక్టర్ మరో చిత్రం!

సారాంశం

కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథకు రజినీ కాంత్ ఓకె చెప్పారని, వీరి కాంబినేషన్ సెట్టయ్యిందని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పేట మూవీ తెరకెక్కింది. పేట తమిళ వర్షన్ రికార్డు వసూళ్లు రాబట్టింది. మరోమారు రజినీ కాంత్ తో ఓ మాస్ ఎంటర్టైనర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడని సమాచారం.   

 రాజకీయాలకు నో చెప్పిన రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ మాస్ చిత్రాల దర్శకుడు శివతో అన్నాత్తే మూవీ చేస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా రజినీ కాంత్ తన తదుపరి చిత్రం కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో మూవీ చేయనున్నాడట. 
దీనిపై అధికారిక చర్చలు ముగియగా త్వరలోనే ప్రకటన అన్న మాట వినిపిస్తుంది. 

కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథకు రజినీ కాంత్ ఓకె చెప్పారని, వీరి కాంబినేషన్ సెట్టయ్యిందని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పేట మూవీ తెరకెక్కింది. పేట తమిళ వర్షన్ రికార్డు వసూళ్లు రాబట్టింది. మరోమారు రజినీ కాంత్ తో ఓ మాస్ ఎంటర్టైనర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. 

మరోవైపు రజినీ కాంత్ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా, దేవుని ఆదేశం మేరకు రాజకీయాలలోకి రావాలన్న ఆలోచన విరమించుకున్నట్లు రజినీ కాంత్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆయన అభిమానులు మాత్రం మనసు మార్చుకొని,  రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు.
 
PREV
click me!

Recommended Stories

Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?
Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని