
అనసూయకి, నెటిజన్లకి ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. అందుకు సోషల్ మీడియా వేదికవుతుంది. అనసూయ ఫోటోలపై నెటిజన్లు వల్గర్ కామెంట్లు చేయడం, అది చూసి మండిపోయిన అనసూయ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది. ఇది రెగ్యూలర్‌గా జరిగేదే అయినా, ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ కి అదొక ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. తాజాగా అలాంటి వివాదమే రేగింది.
ఓ నెటిజన్ మూడేళ్లనాటి అనసూయ ఫోటోపై విమర్శలు గుప్పించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. టీవీ షో ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనసూయ లో బీపీ కారణంగా కల్లు తిరిగి పడిపోయింది. ఆ ఫోటోని ఇప్పుడు లాగి `అందరి అటెన్షన్ కోసం అనసూయ ఇలా చేసింద`ని విమర్శించారు. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన అనసూయకి మండిపోయింది. అంతే ఆ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. `మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోని పట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడటం దండగ. కానీ నువ్వు మొదలు పెట్టావు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వకపోతే మున్ముందు నీలాంటి వాళ్లు మాపై మరింత బురద జల్లే అవకాశం ఉంది. అందుకే నీకు స్ట్రాంగ్ రీప్లై ఇవ్వాలని నిర్ణయించుకున్నా` అని చెప్పింది.
అంతేకాదు ఇంకా స్పందిస్తూ, `మాట్లాడటం చాలా సులభం. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అప్పుడు లో బ్లడ్ ప్రెజర్ ఉంటుంది. ఈ సంఘటన సాయంత్రం 5.30గంటల సమయంలో జరిగింది. దాదాపు 22 గంటలపాటు షాట్స్ చేస్తున్నాం. అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకు` అని చెప్పింది. దీనిపై నెటిజన్లు అనసూయకి మద్దతుగా నిలుస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావని, ఇలాంటి వాళ్లకి ఇలానే బుద్ధి చెప్పాలి అని, అసలు వీరికి స్పందించాల్సిన అవసరం లేదని అనసూయకి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.