పాపం... అకారణంగా శోభిత ధూళిపాళ్ల బలి అయిందిగా!

By Sambi Reddy  |  First Published Aug 25, 2024, 7:22 AM IST

తన ప్రమేయం లేకుండానే శోభిత ధూళిపాళ్ల జనాలకు టార్గెట్ అయ్యారు. ఆమెను ఓ వర్గం తిట్టిపోస్తుంది. అందుకు కారణం ఏమిటో చూద్దాం... 
 



తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల ఇటీవల హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకుంది. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. సమంతతో విడిపోయిన నాగ చైతన్య శోభితకు దగ్గరయ్యాడు. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ గతంలో కథనాలుగా వెలువడ్డాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ ని శోభిత ధూళిపాళ్ల కొట్టిపారేసింది. 

సడన్ గా ఎంగేజ్మెంట్ జరుపుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఆగస్టు 8న నాగార్జున నివాసంలో శోభిత-నాగ చైతన్యల నిశ్చితార్థం వేడుక నిరాడంబరంగా ముగిసింది. అనంతరం నాగార్జున ఈ విషయాన్ని ధృవీకరించారు. నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ ఫోటోలు ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. శోభితను అక్కినేని ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలియజేశారు. కొడుకు, కోడలు కలకాలం ప్రేమానురాగాలతో అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించాడు. 

Latest Videos

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నాగ చైతన్య-శోభితల వివాహం అని ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. కాగా తాజాగా జరిగిన పరిణామంతో జనాలు శోభితను దూషిస్తున్నారు. ఆమెను తిట్టిపోస్తున్నారు. ఆమెది ఐరన్ లెగ్ అంటూ విమర్శల దాడి చేస్తున్నారు. శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో అశుభం చోటు చేసుకుంది అంటున్నారు. 

కాగా మాదాపూర్ సమీపంలో గల తుమ్మిడికుంట చెరువు పక్కన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా కాలం క్రితం నిర్మించారు. అది అక్రమ నిర్మాణం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. HYDRA ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది. కోర్టులో కేసు నడుస్తుండగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం అక్రమం అని నాగార్జున ఆరోపించారు. నాగార్జునకు కోర్టులో ఊరట లభించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా నిలిపి వేసింది. 

శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చకు దారి తీసింది. శోభిత పాదం మంచిది కాదు. ఆమె రాకతో నాగార్జున కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి అంటూ ఆమెను దూషిస్తున్నారు. ఈ తప్పు చేయకుండా, తన ప్రమేయం లేకుండా శోభిత మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవన్నీ మూఢ నమ్మకాలని కొందరు కొట్టి పారేస్తున్నారు. 

అలాగే ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటిది కాదు. 2014లోనే అప్పటి ప్రభుత్వం అది అక్రమ కట్టడం కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు సర్వే నిర్వహించి తుమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని తేల్చారు. నాగార్జున కూల్చివేతను అడ్డుకుంటూ కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మరలా దృష్టి సారించింది. 

click me!