పవన్‌ కళ్యాణ్‌ తో `ఖుషీ 2`.. హీరోయిన్‌ రిక్వెస్ట్ కి ఎస్ జే సూర్య రియాక్షన్‌ ఏంటంటే?

By Aithagoni Raju  |  First Published Aug 24, 2024, 11:34 PM IST

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్‌ మళ్లీ సినిమాలను ప్రారంభించబోతున్నాడు. కానీ `ఖుషి2`కి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. 
 


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో `ఖుషి` ఒకటి. ఈకల్ట్ క్లాసిక్‌ మూవీకి దర్శకుడు ఎస్‌ జే సూర్య. తమిళంలో విడుదలైన చిత్రానికి రీమేక్‌. కానీ తమిళం మించి ఈ మూవీ తెలుగులో పెద్ద హిట్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ నటించడమే ఈ సినిమా ప్రత్యేకత. అంతటి విజయానికి కారణమని చెప్పొచ్చు. పవన్‌ చేసిన మ్యాజిక్‌ అంతగా వర్కౌట్‌ అయ్యింది. దీంతో థియేటర్లలో రచ్చ చేసింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్‌ ప్రస్తావన వచ్చింది. `ఖుషి 2` కోసం డిమాండ్‌ పెరిగింది. హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తన మనసులోని మాట బయటపెట్టింది. `ఖుషి2` సినిమా చేయాలని ఎస్‌ జే సూర్యని కోరింది. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో `సరిపోదా శనివారం` సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌ జేసూర్య నెగటివ్‌ రోల్‌ చేశారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

Latest Videos

ఇందులో ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ, సినిమాకి పనిచేసిన అనుభావాన్ని పంచుకున్నారు. నానితో రెండో సారి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఎస్‌జేసూర్యతోనూ రెండోసారి వర్క్ చేసినట్టు తెలిపింది. ఈసినిమాకి ఆయన ద్వారా చాలా నేర్చుకున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో `ఖుషి2` ఎప్పుడు సర్‌ అని అడిగింది. `ఖుషి2` సినిమా చేయాలని, పవన్‌ సర్ తోనే చేయాలని ఆమె డిమాండ్‌ చేయడం విశేషం. దీనిపై స్పందించాలని కూడా ఆమె అడిగింది. 

అనంతరం ఎస్‌ జేసూర్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. అయితే సూర్య మాట్లాడుతుంటే ఫ్యాన్స్ అరుస్తున్నారు. `ఖుషి2` చేయాలని, అప్‌ డేట్‌ ఇవ్వాలని తెలిపారు. ఈ క్రమంలో చాలా సేపు సూర్యని మాట్లాడనివ్వలేదు. దీంతో ఇబ్బంది పడ్డ ఎస్‌ జే సూర్య.. హింట్‌ ఇచ్చే ప్రయత్నంచేశాడు. కానీ ఏం చెప్పలేదు. సీన్‌ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన లవ్‌ కే పరిమితమయ్యాడు. `ఖుషీ2` అప్‌ డేట్‌ ఇవ్వలేదు. మరి ఇంతకి ఆయనకు ఆ ఆలోచన ఉందా? లేదా అనేది క్లారిటీ లేదు. మరి ప్రియాంక డిమాండ్‌ని ఎస్‌ జే సూర్య నెరవేరుస్తాడా? అనేది చూడాలి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక మోహన్‌.. పవన్‌ తో కలిసి నటిస్తుంది. `ఓజీ`లో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్‌తో `ఖుషి 2` చేయాలనే డిమాండ్‌ చేయడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. `ఓజీ`కి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కానీ త్వరలోనే ఈ సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 

click me!