హృదయాన్ని తాకే 'పెనివిటి' పాట @'అరవింద సమేత'!

Published : Sep 19, 2018, 05:20 PM IST
హృదయాన్ని తాకే 'పెనివిటి' పాట @'అరవింద సమేత'!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా చిత్రబృందం 'పెనివిటి' అనే మరో పాటను విడుదల చేసింది.

ఈ పాటలో ముందుగా ఎన్టీఆర్ కి తమ బామ్మ ''నువ్ కడుపున పడినాకే నీ అమ్మని గెలిసేసానని అనుకున్నాడో ఏందో.. దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలోకి పోయి ఊరిని గెలసడం మొదలుపెట్టాడు'' అంటూ ఎన్టీఆర్ తండ్రి గురించి చెబుతుంటుంది.

పాటకు ముందు వినిపించిన ఈ మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకే హైలైట్ నిలిచింది. థమన్ అందించిన సంగీతం పాటకి ప్రాణం పోసిందనే చెప్పాలి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే